అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Land Grabbing | నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రత్యేకించి శిఖం భూములను కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. రాత్రికిరాత్రి హద్దు రాళ్లు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ నగరానికి చెందిన అధికార కాంగ్రెస్ నేత(Congress Leader) భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు భూమి విలువ రూ.20 కోట్ల వరకు ఉండటం గమనార్హం.
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ (Sarangapoor) సర్వే నంబర్ 231లో ప్రభుత్వ, శిఖం భూమి ఉంది. ఈ భూమిపై మొన్నటి వరకు ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. కానీ, తాజాగా అధికార పార్టీకి చెందిన నేత, మాజీ కార్పొరేటర్ సదరు భూమిని కబ్జా (Land grabbing) చేశాడు. నకిలీ పత్రాలతో తన బినామీల ద్వారా సంబంధిత స్థలంలో వెంచర్ పనులు మొదలు పెట్టాడు. హద్దు రాళ్లు పాతడమే కాకుండా ఏకంగా అమ్మకాలు కూడా ప్రారంభించడం గమనార్హం. ఇంత జరగుతున్నా రెవెన్యూ అధికారులు (Revenue officers) అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ భూమి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Land Grabbing | ఆది నుంచి వివాదాస్పదమే..
అధికార కాంగ్రెస్(Congress)లో కొనసాగుతున్న సదరు మాజీ కార్పొరేటర్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. భూ కబ్జాలు చేయడం, అక్రమ మొరం తవ్వకాలు జరపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలోనూ అతగాడు పలుచోట్ల భూములు ఆక్రమించాడు. అక్రమ మొరం తవ్వకాల వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఓ పార్టీ(suspended from party) నుంచి సస్పెండ్ అయ్యాడు. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన సదరు నేత తమ పార్టీ అధికారంలోకి రావడంతో అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నాడు. తన బినామీల ద్వారా తిరిగి కబ్జాలు మొదలు పెట్టాడు.
Land Grabbing | కలెక్టర్‌కు ఫిర్యాదు
సారంగాపూర్ శివారులోని సర్వే నంబర్ 231లో జరుగుతున్న భూకబ్జా వ్యవహారంపై ఎంఐఎం నాయకులు(MIM Leaders) స్పందించారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు ఫయాజ్(MIM president Fayaz) ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu)ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే శిఖం భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సర్వే జరిపించి సదరు భూమిని కాపాడాలని వారు విన్నవించారు. కాగా.. ఆర్డీవోతో విచారణ చేయించి సర్వే జరిపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.