ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mahanadu | ఆ పార్టీలు అడ్రస్​ లేకుండా పోయాయి: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

    Mahanadu | ఆ పార్టీలు అడ్రస్​ లేకుండా పోయాయి: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Mahanadu | టీడీపీ మహానాడు కార్యక్రమం కడపలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కడపలో తొలిసారి మహానడు ఏర్పాటు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దేవుని గడపలో జరగబోతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందన్నారు. దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు టీడీపీ ఎదుర్కుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ(TDP) పని అయిపోయిందని చెప్పిన పార్టీలు.. అడ్రస్‌ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు.

    Mahanadu | ఏపీ దశను నిర్దేశిస్తుంది

    దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, కానీ టీడీపీ(TDP) మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు కొనసాగిస్తోందన్నారు. కడపలో మహానాడు (Mahanadu) ఏపీ దశ దిశను నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలకు 7 గెలిచి సత్తా చాటామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్‌ చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి ఘనవిజయం అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

    Mahanadu | కార్యకర్తలను వేధించారు

    గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను వేధించారని చంద్రబాబు(CM Chandrababu) నాయుడు అన్నారు. ఎంతో మంది కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేశారన్నారు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని బాబు భరోసా ఇచ్చారు.

    Mahanadu | హైదరాబాద్​లో ఐటీ ప్రారంభించా..

    తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్‌లో ఐటీ(Hyderabad IT hub) ప్రారంభించానని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) ద్వారా ఏఐకి ప్రాధాన్యతనిచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తానని అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్నివర్గాల అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

    Latest articles

    Rahul Gandhi | బీహార్​లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ అడుగులు​.. ఓటర్​ అధికార్​ యాత్ర చేపట్టనున్న రాహుల్​ గాంధీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | బీహార్​లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్నాయి....

    Krishnashtami | ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Krishnashtami | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే...

    Medical Health Director | వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ హెల్త్ డైరెక్టర్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు...

    Heavy Rains | భారీ వర్షాలతో పలుచోట్ల కూలిన ఇళ్లు, ప్రహరీలు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి...

    More like this