ePaper
More
    HomeతెలంగాణCp Sai Chaitanya | ఫార్మా పేరుతో అల్ప్రాజోలం దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

    Cp Sai Chaitanya | ఫార్మా పేరుతో అల్ప్రాజోలం దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Cp Sai Chaitanya | మహారాష్ట్రలోని (Maharashtra) సతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్ప్రాజోలంను (Alfazolam) ఉత్పత్తి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం కమిషనరేట్​లోని కార్యాలయంలో (Office in the Commissionerate) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ వివరాలు వెల్లడించారు.

    నార్కోటిక్ డ్రగ్ (Narcotic drug) బృందం ఇంటర్​ షిప్ ద్వారా బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ఆధ్వర్యంలో అల్ఫ్రజోలం కేసు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సతారాలో సూర్య ప్రభ ఫార్మా కెన్ ఇండస్ట్రీ (Surya Prabha Pharma Industry) లో నిషేధిత మత్తు పదార్థాలు తయారీ అవుతున్నట్లు గుర్తించారు. ఇండస్ట్రీ నడుపుతున్న అమర్ సింగ్ దేశ్​ముఖ్​, ప్రసాద్ కడేరీ బయో సిమ్యులెంట్ కంపెనీ యజమాని బాబురావు, ఆల్ఫాజోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్, రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ విశ్వనాథ్​ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు తెలంగాణలోని (Telangana) కల్లు డిపోలకు అక్రమంగా అల్ప్రాజోలం రవాణా చేస్తున్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు.

    Cp Sai Chaitanya | లక్ష్మణ్​ గౌడ్​ ఇచ్చిన సమాచారంతో..

    నిందితులు బోధన్ (Bodhan) గ్రామీణ పరిధిలోని సాలూరు గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కు 2.5 కిలోల ఆల్ఫ్రాజోలం డెలివరీ చేసే సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మొత్తం అల్ప్రాజోలం రాకెట్ గుట్టు రట్టయిందని సీపీ తెలిపారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి తీసుకుంటామని చెప్పారు.

    Cp Sai Chaitanya | మొత్తం సుమారు రూ.8 కోట్ల విలువ..

    పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు రూ.8కోట్లు ఉంటుంది. మహారాష్ట్రలోని ఉమేర్గా నుంచి సోలాపూర్ (Solapur) వెళ్లే జాతీయ రోడ్డుపై నిందితుల్లో ఒకడైన బాబురావు నుంచి రూ.3 కోట్ల విలువ చేసే 30 కిలోల అల్ప్రాజోలం సీజ్ చేశారు. అలాగే సతారాలోని అమర్ సింగ్ దేశ్​ముఖ్​ నివాసంలో రూ.12 లక్షల నగదు, రూ. 4 కోట్ల విలువ చేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీని సీజ్​ చేశారు. అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగిస్తున్న ఫోర్డ్ కారును కూడా సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ విజయ్ బాబు, నార్కోటిక్స్ బృందాన్ని సీపీ అభినందించారు.

    Latest articles

    Gold price on august 21 | త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఇంకా ల‌క్ష మార్క్ పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold price on august 21 | బంగారం కొనాల‌నుకున్న వారు ఏ మాత్రం ఆల‌స్యం...

    Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis on August 21 | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో...

    Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

    అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు....

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this