అక్షరటుడే, ఇందూరు: Waqf Amendment Bill | వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (Muslim Joint Action Committee) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
నగరంలోని నెహ్రూ పార్క్(Nehru Park) నుంచి అర్సపల్లి (Arsapalli) వరకు రోడ్డుకు ఇరువైపుల ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. తాము వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకమని, దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా వక్ఫ్ బిల్లును (Waqf Amendment Bill) తీసుకొచ్చిందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.