ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NEET - 2025 | 1500లోపు ర్యాంక్ వ‌స్తేనే ఎయిమ్స్‌లో సీటు.. నీట్‌-2025 అభ్య‌ర్థుల కోసం...

    NEET – 2025 | 1500లోపు ర్యాంక్ వ‌స్తేనే ఎయిమ్స్‌లో సీటు.. నీట్‌-2025 అభ్య‌ర్థుల కోసం విశ్లేష‌ణ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NEET – 2025 | ఎంబీబీఎస్‌(MBBS).. ఎంతో మంది విద్యార్థుల క‌ల‌. ల‌క్ష‌లాది మందికి డాక్ట‌ర్‌గా స్థిర‌ప‌డాల‌న్నదే ప్ర‌ధాన‌ ల‌క్ష్యం. ఇందుకు గాను మొన్న నిర్వ‌హించిన జాతీయ ప్ర‌వేశ అర్హ‌త ప‌రీక్ష (NEET 2025)కు హాజ‌ర‌య్యారు. అయితే, ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) సంస్థ‌ల్లో సీటు వ‌స్తే కెరీర్ గొప్ప‌గా ఉంటుంది. ఢిల్లీ, జోధ్‌పూర్‌, భోపాల్‌, భువ‌నేశ్వ‌ర్ ఎయిమ్స్‌ల‌లో అవ‌కాశం ల‌భిస్తే ఆ విద్యార్థుల భ‌విష్య‌త్తుకు ఢోకా ఉండదు. ఈ నేప‌థ్యంలో ఏ ర్యాంకు వ‌స్తే ఏ కాలేజీలో చోటు వ‌స్తుందో విశ్లేషించే క‌థ‌న‌మిది.

    NEET – 2025 | ర్యాంకే ప్ర‌ధానం

    ఎంబీబీఎస్‌లో చేరాలంటే NEET UGలో స్కోర్ చేయడం, అర్హత సాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అడ్మిషన్‌, కౌన్సెలింగ్‌(Counseling)లో పాల్గొనడానికి అభ్యర్థి అర్హతను నిర్ణయిస్తుంది. అందుకే , విద్యార్థులు త‌మ కేటగిరీ ఆధారంగా NEET 2025 కనీస అర్హత మార్కులను తెలుసుకోవాలి. విద్యార్థులు మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి, కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన అంచనా కనీస మార్కులను దాటాలి.

    NEET – 2025 | క‌ఠినమైన‌ ప్ర‌శ్న‌లు.. త‌గ్గ‌నున్న ర్యాంకులు

    ఈ సంవత్సరం NEET UG ప్ర‌వేశ ప‌రీక్ష ప‌త్రం చాలా క‌ఠినంగా వ‌చ్చింది. గ‌త సంత్స‌రాల‌తో పోలిస్తే.. ఇది చాలా కఠినంగా ఉంద‌ని విద్యార్థుల‌తో పాటు నిపుణులు సైతం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా ఫిజిక్స్‌లో చాలా ట‌ఫ్ క్వ‌శ్చ‌న్లు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల మార్కులు గ‌తంతో పోలిస్తే.. ఈసారి త‌గ్గ‌డం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. NEET 2025 కేటగిరీ వారీగా ఆశించిన కనీస అర్హత మార్కులు విద్యార్థుల భ‌విష్య‌త్తును(Students Future) నిర్ణ‌యించ‌నున్నాయి. ఎందుకంటే ఈ మార్కులు MBBS, BDS, AYUSH ప్రోగ్రామ్‌ల వంటి వివిధ వైద్య కోర్సులలో కౌన్సెలింగ్, ప్రవేశానికి అర్హతను నిర్ణయిస్తాయి.

    NEET – 2025 | కనీస అర్హత మార్కులు..

    ఈసారి క‌ఠిన‌మైన పేప‌ర్ రావ‌డంతో మార్కులు త‌గ్గుతాయ‌ని భావిస్తున్నారు. సీటు రావ‌డానికి అంచనా వేసిన కనీస అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. జ‌న‌ర‌ల్ విభాగంలో 130 నుంచి 140, EWS కోటాలోనూ 135 నుండి 140, OBC 103 నుండి 109, SC 98 నుంచి 105 మార్కులు వ‌స్తే సీటు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

    NEET – 2025 | 1500 లోపు వ‌స్తేనే ఎయిమ్స్‌లో..

    జాతీయ స్థాయిలో కొన్ని వైద్య విద్య క‌ళాశాల‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. అందులో ప్ర‌ధానంగా ఎయిమ్స్ సంస్థ‌ల‌పైనే విద్యార్థుల దృష్టి ఉంటుంది. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడిక‌ల్ సైన్సెస్(All India Institute of Medical Sciences) సంస్థ‌ల్లో సీటు రావాలంటే నీట్‌లో అత్యుత్త‌మ మార్కులు సాధించాలి. ఎయిమ్స్ సంస్థ‌ల్లో ఢిల్లీ, జోధ్‌పూర్‌, భోపాల్‌, భువ‌నేశ్వ‌ర్ వంటి వాటివైపే విద్యార్థులు మొగ్గు చూపుతారు. ఈ నేప‌థ్యంలో ఏ ర్యాంక్ వ‌స్తే ఏ సంస్థ‌లో సీటు వ‌స్తుందో అంచ‌నా వేయ‌వ‌చ్చు.

    న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు రావాలంటే నీట్ జ‌న‌ర‌ల్ విభాగంలో ఆలిండియా లెవ‌ల్‌లో 45 లోపు ర్యాంక్ రావాలి. అదే ఈడ‌బ్ల్యూఎస్ కోటా అయితే 210. ఓబీసీ అయితే 185, ఎస్సీలైఐతే 640, ఎస్టీలైతే 1148 లోపు ర్యాంకు సాధించిన వారికి ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

    అదే జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో జ‌న‌ర‌ల్ విభాగంలో 373, ఈడ‌బ్ల్యూఎస్ కోటా అయితే 803, ఓబీసీ అయితే 690, , ఎస్సీలైఐతే 4900, ఎస్టీలైతే 10279 లోపు ర్యాంకు వారికి సీటు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

    ఇక భోపాల్ ఎయిమ్స్‌లో జ‌న‌ర‌ల్ కోటాలో 505, ఈడ‌బ్ల్యూఎస్ కోటా అయితే 1010, ఓబీసీ అయితే 1010, ఎస్సీలైఐతే 990, ఎస్టీలైతే 15643 లోపు ర్యాంకు సాధించిన వారు పొందే చాన్స్ ఉంది.

    ఇలాగే, భువ‌నేశ్వ‌ర్‌, రుషికేశ్‌, నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, పాట్నా, భాటిండా ఎయిమ్స్‌ల‌లో సీటు రావాలంటే జ‌న‌ర‌ల్ విభాగంలో 1500లోపు నీట్ ర్యాంక్ రావాలి. ఈడ‌బ్ల్యూఎస్ కోటా అయితే 3600, ఓబీసీ అయితే 2721, ఎస్సీలైతే 16961, ఎస్టీలైతే 40 వేల‌ లోపు ర్యాంకు సాధిస్తే ఆయా సంస్థ‌ల్లో సీటు ల‌భించే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...