అక్షరటుడే, వెబ్‌డెస్క్:Covid | కరోనా వైరస్(Corona Virus) మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి.
పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే గైడ్ లైన్స్ సైతం జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలలో సైతం కరోనా కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి Corona మరోసారి తన కల్లోలాన్ని చూపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి Tadepallyలోని మణిపాల్ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Covid | విజృంభిస్తున్న కరోనా..
ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు మరియు తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. అధికారిక సమాచారం మేరకు వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతనికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతనికి ఐసీయూ ICUలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా వారిని కూడా ప్రత్యేక విభాగంలో ఉంచారు. వీరి ద్వారా వైరస్ (Corona Virus) వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.
Corona Cases: ఆ రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం
ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కేరళ KERALAలో అత్యధికంగా 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర- 209, ఢిల్లీ- 104, కర్ణాటక- 47 కేసులు రికార్డయ్యాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి తీవ్రత నెలకొంది.
ఒక్క రోజులోనే మొత్తంగా 1,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి- అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మాత్రమే. దేశంలో కోవిడ్ (Covid) తొలి మరణం నమోదైంది. బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ మరణించారు.