అక్షరటుడే, ఇందూరు: Candlelight rally | పహల్గాంలో Pahalgam ఉగ్రవాదుల దాడిలో అమరులైన టూరిస్టులకు జిల్లాలో పలువురు నివాళులు అర్పించారు. బుధవారం కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు.

ఈ సందర్భంగా టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ TNGOs District President Nasetti Suman మాట్లాడుతూ.. పర్యటాకుల మృతికి కారణమైన టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ర్యాలీలో టీఎన్జీవోస్​ జిల్లా కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Candlelight rally | ఇందల్వాయిలో..

  ఇందల్వాయిలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అక్షరటుడే, ఇందల్వాయి: మండల కేంద్రంలో బీజేపీ మండ​లాధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులపై Tourists ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Candlelight rally |ఉగ్రదాడిని ఖండిస్తున్నాం

న‌గ‌రంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ..

అక్షరటుడే, ఇందూరు: ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, విజయ్, మాస్టర్ శంకర్, శ్రీధర్, ఇపకాయల కిషోర్, వేణు రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.