ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Wyra Former MLA Madanlal | గుండెపోటుతో వైరా మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ క‌న్నుమూత‌

    Wyra Former MLA Madanlal | గుండెపోటుతో వైరా మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ క‌న్నుమూత‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వైరా మాజీ ఎమ్మెల్యే(Former wyra MLA), బీఆర్ఎస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి(BRS party constituency in-charge) బానోతు మ‌ద‌న్‌లాల్ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అస్వ‌స్త‌త‌కు గురైన ఆయ‌న‌ హైద‌రాబాద్‌(Hyderabad)లోని ఏఐజీ ఆస్ప‌త్రి(AIG Hospital)లో చేరారు. చికిత్స పొందుతున్న త‌రుణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు.

    తెలంగాణ(Telangana) వ‌చ్చిన త‌ర్వాత 2014లో జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న వైఎస్సార్ సీపీ(YSRCP) త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందారు. అనంత‌రం బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీలో చేరిపోయారు. 2018, 2023 ఎన్నిక‌ల్లో elections బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు.

    Wyra Former MLA Madanlal : అస్వ‌స్త‌త‌కు గురై..

    గ‌త వారం ఖ‌మ్మంలోని త‌న నివాసంలో ఉన్న స‌మ‌యంలో మ‌ద‌న్‌లాల్ అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. వాంతులు, విరేచనాలు కావ‌డంతో కుటుంబ స‌భ్యులు స్థానిక ఆస్ప‌త్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం నాలుగు రోజుల క్రితం హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతున్న త‌రుణంలో మంగ‌ళ‌వారం ఉదయం గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

    Wyra Former MLA Madanlal : సంతాపం తెలిపిన కేసీఆర్‌..

    మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌BRS chief KCR సంతాపం వ్యక్తం చేశారు. మదన్‌లాల్‌ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మ‌రోవైపు, మదన్‌లాల్‌ మృతిపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు261.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సంతాపం తెలిపారు.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...