అక్షరటుడే, వెబ్‌డెస్క్ : French president | వైవాహిక జీవితం అనేది సుఖంగా ఉండాలంటే భార్యాభర్తల (husband and wife) పాత్ర సమానంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరి మధ్య అండస్టాండింగ్ ఉండాలి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గడం వంటివి చేస్తే బంధాలు (relationship) నిలబడతాయి.
అయితే ఇటీవలి కాలంలో భార్యా భర్తల బంధాలు బాగా దెబ్బతింటున్నాయి. భాగస్వామి ఎంతో ప్రేమగా ఉంటున్నా కూడా కొన్ని సార్లు ఆమె చేసే పనులు మగవాడికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కొందరు మగాళ్లు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటే, మరి కొందరు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడిపై (France president) ఆయన భార్య చేయి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
French president | భర్తపై చేయి చేసుకుంది..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ (France president Emmanuel Macron) నాలుగు రోజుల పాటు ఆగ్నేయాసియా దేశాలలో (Southeast Asian countries) పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా వారు ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. హనోయ్ విమానాశ్రయంలో (Hanoi airport) మాక్రన్ ప్రత్యేక విమానం ల్యాండ్ కాగా, విమానం తలుపు తెరుచుకుంటున్న సమయంలో మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టే చెంప మీద గట్టిగా కొట్టింది. ఈ సన్నివేశం కెమెరాలలో రికార్డ్ అయింది. అయితే ఆ ఘటనతో మాక్రన్ కొద్దిసేపు ఆగిపోయారు. విమానం తలుపు తెరుచుకున్నట్టు గమనించి వెంటనే నవ్వుతూ బయటకు వచ్చారు. ఆయన వెనుకే బ్రిగెట్టే కూడా బయటకు వచ్చారు.
ఈ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ను (France president Emmanuel Macron) అతడి భార్య బ్రిగిట్టే (Wife Brigitte) చెంప దెబ్బ ఎందుకు కొట్టినట్టు అని చర్చ నడుస్తుంది. అయితే ఇద్దరూ కలిసి విమానం దిగుతున్న సమయంలో మాక్రన్ తన భార్య చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించినా కూడా ఆమె ఆసక్తి చూపలేదు. తన భర్తపై బ్రిగెట్టే కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు కనిపించారు. అయితే మాక్రన్ మాత్రం తన మొహంలో ఎలాంటి భావాలను బయటకు కనపడకుండా బాగానే మేనేజ్ చేశాడు.
కాకపోతే వీడియో లీక్ (video leaked) కావడంతో ఇప్పుడు వారి విషయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ (international hot topic) అయింది. మొగుడు పెళ్లాలు అన్నాక ఆ మాత్రం ఫైటింగ్స్ కామన్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు