ePaper
More
    HomeతెలంగాణGovt Employees | ఉద్యోగుల‌కు రేవంత్ స‌ర్కారు శుభ‌వార్త‌.. జూన్ 2న డీఏ విడుద‌ల‌

    Govt Employees | ఉద్యోగుల‌కు రేవంత్ స‌ర్కారు శుభ‌వార్త‌.. జూన్ 2న డీఏ విడుద‌ల‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Employees | నిరాశ‌తో ఉన్న ఉద్యోగుల‌కి రేవంత్( Revanth Reddy) స‌ర్కార్ తీపి క‌బురు అందించ‌నుంది.

    ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు.. కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం. డీఏ విడుదలతో పాటు బకాయిల చెల్లింపు త్వరలో ఉండనుందని సమాచారం. పదవీ విరమణ(Retirement) పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతోపాటు పెండింగ్‌ బకాయిలు (Pending Bills) చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. కరువు భత్యం(DA), ఆరోగ్య పథకం(Health Scheme) ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    Govt Employees | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున..

    ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) జూన్‌ 2వ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకు (Govt Employees) తీపి కబురు అందించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. దీనిలో ముగ్గురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై.. వారి అభ్యర్థనలను విన్నది. ముఖ్యమైన డిమాండ్ల ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించినట్లు.. ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

    త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగులు సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి నివేదిక అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేనట్టు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో 2 డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా ఒక డీఏ విడుదలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    ఉద్యోగులు కోరుతున్న వాటిలో ఆరోగ్య పథకం Health Scheme ఒకటి. అది ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూత్రప్రాయంగా చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, వేతనాల పెంపు, డీఏలు, పీఆర్‌సీ (DA, PRC) వంటి వాటి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.

    Latest articles

    Chennai Airport | చెన్నై ఎయిర్ పోర్టులో హై గ్రేడ్ గంజాయి.. విలువ రూ.12 కోట్ల పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21)...

    Tollywood Movie shootings | ప్రొడ్యూసర్లు – ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వివాదానికి తెర.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood Movie shootings : ప్రొడ్యూసర్లు(producers), ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మధ్య వివాదానికి తెర పడింది....

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    More like this