ePaper
More
    HomeజాతీయంRajasthan | జైలులో ఉండాల్సిన ఖైదీలు హోట‌ల్స్‌లో భార్య‌లు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్.. ఎక్కడో తెలుసా..!

    Rajasthan | జైలులో ఉండాల్సిన ఖైదీలు హోట‌ల్స్‌లో భార్య‌లు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | అధికారులు వ‌క్ర‌మార్గంలో ప‌య‌నిస్తే స‌మాజంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానికి తాజా ఘ‌టన నిద‌ర్శ‌నం.

    రాజస్థాన్‌లోని జైళ్ల శాఖ అధికారులు (Jail Officers) అవినీతి బాగోతం బయటపెట్టే సంఘటన తాజాగా ఒకటి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు, వైద్య పరీక్షల (medical tests) పేరుతో బయటకు వచ్చి, ఏకంగా హోటళ్లలో తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఏకాంతంగా గ‌డ‌ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. మెడికల్ టెస్ట్‌ల (medical tests) పేరుతో జైలు నుంచి బయటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జైలు అధికారులకు లంచాలు ముట్టజెప్పడంతో వారే స్వయంగా దగ్గరుండి ఖైదీలను బయటికి పంపిస్తున్నారు.

    Rajasthan | లంచాల‌తో..

    పోలీసుల ఎస్కార్ట్, జైలు డాక్టర్ల పర్మిషన్‌తో కొందరు హై ప్రొఫైల్ ఖైదీలు (high-profile prisoners) ఇలాంటి పార్టీలు చేసుకుంటున్నట్లు తాజాగా బయటికి వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం బయటికి రావడంతో ఖైదీలు, కానిస్టేబుల్‌లతో (prisoners and constables) పాటు ఖైదీల బంధువులను కలిపి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.

    నలుగురు హై ప్రొఫైల్ ఖైదీలు రఫీక్ బక్రీ, భాన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తాలు.. జైలు డాక్టర్ల అనుమతి, పోలీస్ ఎస్కార్ట్‌ల (Police Escort) సహకారంతో బయటికి వెళ్లి విందులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు కానిస్టేబుళ్లు (constables), నలుగురు ఖైదీలు, నలుగురు బంధువులు ఉన్నారు. ఈ అనధికారిక పర్యటనలకు ఖైదీలు రూ.25 వేలు చెల్లించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది.

    శనివారం రోజున జైపూర్‌లోని (Jaipur) ఒక హోటల్ లాబీ బయట.. జైలు గార్డులు టీ తాగుతుండగా.. లోపల ఇద్దరు హై ప్రొఫైల్ ఖైదీలు టిఫిన్ చేస్తున్నారు . ఆ ఖైదీల చేతికి బేడీలు లేకపోవడం గమనార్హం. ఇది పక్కన పెడితే అదే జైపూర్ నగరంలో (Jaipur city) మరో చోట.. మరో ఇద్దరు ఖైదీలు ఒక మహిళ పేరుతో బుక్ చేయబడిన గదిలో రెస్ట్ తీసుకున్నారు.

    ఈ ఇద్దరు ఖైదీల్లో ఒకరు శిక్ష పడిన వ్యక్తికి నమ్మకస్తుడు. మరొకరు అతని సహచరుడు ఉన్నారు. వారిని కలిసిన మహిళల్లో ఒకరు అతని భార్య కాగా, మరొకరు అతని లవర్ అని తేలింది. రాజస్థాన్ జైలు వ్యవస్థ (Rajasthan prison system) డబ్బుతో నడుస్తుందని.. అక్కడి డాక్టర్లు, సిబ్బంది, సీనియర్ అధికారులు (doctors, staff and senior officers) అందరూ సహకరిస్తారని విచారణలో ఒక ఖైదీ అంగీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం మరిన్ని విమర్శలకు కారణం అయింది.

    దర్యాప్తు అధికారులు (investigating officers) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖైదీలు తమ అనధికారిక విందుల (unofficial dinners) కోసం మధ్యవర్తి ద్వారా రూ.25 వేలు చెల్లించారు. ఒక్కో ఎస్కార్ట్‌కు రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు నలుగురు తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉండగా.. ఎవరూ సరైన సమయలో రాలేదని గుర్తించారు. ఒక ఖైదీ బంధువు రూ.45 వేలతో హోటల్‌లో పట్టుబడినట్లు చెప్పారు. ఆ హోటల్ రూమ్ (Hotel room) నుంచి పోలీసులు అనేక ఖైదీల ఐడీలను గుర్తించారు.

    జైలు వర్గాలు (jail sources) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి జైలు లోపల ఉన్న ఒక ఖైదీ అని గుర్తించారు. అతను జైలు సిబ్బంది, బయటి వ్యక్తుల (prison staff and outsiders) నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేల్చారు.

    ఏప్రిల్ నుంచి 200కి పైగా ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేయగా.. రాజస్థాన్ జైలు (Rajastan Jail) వ్యవస్థ భయానక చిత్రాన్ని చూపించాయని.. జైలులోకి ఫోన్లు విచ్చలవిడిగా వెళ్తున్నాయని తేలింది. జైలులోని కొందరు కానిస్టేబుళ్లకు లంచాలు ముట్టజెప్తూ ఖైదీలు దొంగతనంగా ఫోన్లు వాడుతున్నారని, ఆ ఫోన్ల ద్వారా ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో (Chief Minister Bhajanlal Sharma) పాటు పలువురు వీఐపీలకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని కూడా గుర్తించినట్లు వారు చెప్పారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...