ePaper
More
    HomeతెలంగాణBhatti Vikramarka | కాంగ్రెస్​ వస్తే కరెంట్​ ఉండదన్నారు.. కోతలు లేకుండా ఇస్తున్నాం: భట్టి

    Bhatti Vikramarka | కాంగ్రెస్​ వస్తే కరెంట్​ ఉండదన్నారు.. కోతలు లేకుండా ఇస్తున్నాం: భట్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | కాంగ్రెస్​ వస్తే కరెంట్​ ఉండదని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​ అన్నారని, కానీ ప్రస్తుతం తాము కోతలు లేకుండా విద్యుత్​ సరఫరా (supplying electricity) చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు.

    నాగర్​కర్నూల్​ జిల్లా (Nagarkurnool district) అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లన్నీ (power generation plants) కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనివే అని భట్టి పేర్కొన్నారు. 17,162 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చినా.. కోతలు లేకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉంచిన రూ.8 వేల కోట్ల బకాయిలు తీర్చామని తెలిపారు.

    Bhatti Vikramarka | దెయ్యాలను వదిలించుకున్నారు

    అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలోకి తీసుకు వెళ్తామని భట్టి తెలిపారు. ప్రపంచం, దేశం తెలంగాణ (Telangana) వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. కులగణన చేసిన తీరును ఇతర రాష్ట్రాలు తెలుసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలు దెయ్యాలను వదిలించుకొని తమను గెలిపించారని భట్టి విక్రమార్క అన్నారు. దెయ్యాలకు నాయకత్వం వహించే వ్యక్తి దేవుడా అని విమర్శించారు.

    Bhatti Vikramarka | పాలమూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

    ఉమ్మడి పాలమూరు జిల్లా (Palamuru district) అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులు (Palamuru projects) వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 2050 నాటికి గాలి, సోలార్, నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్లకు పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...