Transport Department
Transport Department | స్కూల్​ బస్సులకు ఫిట్​నెస్​ చేయించాలి

అక్షరటుడే, ఇందూరు: Transport Department | విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల యాజామ్యానం తమ స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్​నెస్​ చేయించాలని రాష్ట్ర రవాణా శాఖ సంయుక్త కమిషనర్ (Joint Commissioner of Transport) చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. సోమవారం జిల్లా కార్యాలయానికి విచ్చేసిన నేపథ్యంలో ‘అక్షరటుడే’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

Transport Department | 180 బస్సులకు మాత్రమే ఫిట్​నెస్..​

స్కూల్ బస్సుల ( School Bus) విషయంలో యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రధానంగా 15 ఏళ్లు దాటిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. బస్సు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేయాలి. 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్​కు అనర్హులు. పది బస్సుల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలు డ్రైవర్లను అదనంగా నియమించుకోవాలి. జిల్లాలో 780 స్కూల్ బస్సులకు గాను.. 180 మాత్రమే ఫిట్​నెస్​ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా బస్సులను యాజమాన్యాలు ఫిట్​నెస్​ చేయించాలి.

Transport Department | పిల్లలను కాపాడితే రివార్డు…

పాఠశాల బస్సుకు ప్రమాదం జరిగి చిన్నారులు అపాయంలో ఉన్నప్పుడు కాపాడితే ప్రభుత్వం రివార్డును అందజేస్తుంది. ప్రధానంగా గోల్డెన్ అవర్స్​లో (Golden Hours) విద్యార్థులను ఆస్పత్రులకు తరలిస్తే రవాణా శాఖ సిఫార్సుతో రూ.25 వేలు అందజేస్తుంది. గతంలో ఈ రివార్డు రూ.5 వేలు ఉండేది.

Transport Department | నేరుగా ఆఫీస్​కు రండి..

ప్రజలకు లైసెన్స్​ తదితర ఎలాంటి పనులున్నా నేరుగా ఆర్టీఏ ఆఫీస్​కు (RTA Office) రావాలి. అనవసరంగా ఏజెంట్లను సంప్రదించవద్దు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్ల​కు కార్యాలయాల్లో అనుమతి నిరాకరించాం. ఏ వ్యక్తికైతే పని ఉంటుందో వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నాం. అన్ని జిల్లాల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.

Transport Department | అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి..

జిల్లాలోని రవాణా శాఖ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. అవినీతికి దూరంగా ఉండాలి. ఏదైనా ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. లైసెన్సుల జారీ, వాహన రిజిస్ట్రేషన్​లో పక్కాగా వ్యవహరించాలి. ప్రధానంగా చెక్​పోస్ట్​లలో పనిచేసే వారిపై నిఘా ఉంటుంది.

Transport Department | త్వరలోనే ప్రత్యేక డ్రైవ్..

స్కూల్ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, క్యాబ్​లు ఇతర వాహనాలపై త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై కఠినచర్యలు ఉంటాయి. జిల్లా అధికారులతో పాటు రాష్ట్రస్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. స్కూల్​ బస్సులను ప్రత్యేకంగా తనిఖీ చేస్తారు.