అక్షరటుడే, వెబ్‌డెస్క్:Saudi Arabia | సౌదీలో saudi arabia ఇస్లామిక్ ఆచారాలు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ కఠినమైన షరియత్ చట్టాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పు చోటు చేసుకోబోతుంది. గత 73 ఏళ్లుగా మద్య నిషేధం అమలులో ఉన్న ఆ దేశంలో 2026 నాటికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, పరిమిత వినియోగానికి అనుమతి లభించబోతుంది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(Mohammed bin Salman) ప్రవేశపెట్టిన ‘విజన్ 2030’ ప్రణాళికలో భాగంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Saudi Arabia | ఈ నిర్ణయం వెనక కారణం?
సౌదీని పర్యాటక, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంలో ‘హరాం’ (నిషేధితం)గా భావించే మద్యం, సౌదీ ఆధునిక ప్రస్థానంలో భాగమవుతుందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. సౌదీ మీడియా(Saudi Media) నివేదికల ప్రకారం.. ఈ మార్పు పూర్తిగా కంట్రోల్డ్ లైసెన్సింగ్ సిస్టమ్ కింద అమలు చేయబడుతుంది అని అక్కడి మీడియాలో కథనాలు.వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం సౌదీ అరేబియాలో సుమారు 600 చోట్ల మద్యం అమ్మకాలు చేయనున్నారు. ఇందులో ఫైవ్-స్టార్ హోటళ్లు, అధునాతన రిసార్ట్లు High-End Resorts, దౌత్య కార్యాలయాల ప్రాంతాలు Diplomatic Zones, నియోమ్ Neom, సిందాళా ద్వీపం Sindalah Island, రెడ్ సీ ప్రాజెక్ట్ Red Sea Project వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్ట్‌లున్నాయి.
అయితే ఈ సౌకర్యం అంతర్జాతీయ పర్యాటకులు, ప్రవాసులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్థానిక పౌరులకు, సాధారణ బహిరంగ ప్రదేశాల్లో మద్యం ఇప్పటికీ నిషేధం ఉంది. విస్కీ(Whiskey), వోడ్కా(Vodka) వంటి 20శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు ఇప్పటికీ నిషేధించబడ్డాయి. మద్యం ఇళ్లలో, మార్కెట్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మబడదు. ఎవరూ వ్యక్తిగతంగా మద్యం తయారు చేయడానికి అనుమతి లేదు. మద్యం కేవలం లైసెన్స్ పొందిన ప్రదేశాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా మాత్రమే అందించబడుతుంది.
కాగా.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యాటకం, ఆతిథ్య సేవలు hospitality , వినోద రంగాలను ప్రోత్సహించడం. 2030లో జరగనున్న ఎక్స్పో (Expo 2030), 2034లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2034) వంటి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ అరేబియా సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సౌదీలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.