అక్షరటుడే, ఇందూరు: Transport Department | స్కూల్‌బస్ ఫిట్నెస్ బాధ్యత యాజమాన్యాలదేనని, ప్రతి బస్సును ఫిట్నెస్ చేయించాలని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ (Joint Commissioner of Transport Department Chandra Shekhar goud) సూచించారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో (District Transport Department office) పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ.. బడిపిల్లల బాధ్యత మనందరిదన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Transport Department | 60 ఏళ్ల పైబడిన డ్రైవర్లు బస్సులు నడపొద్దు..
60 ఏళ్ల వయసు పైబడిన డ్రైవర్లు బస్సులను నడపడానికి అనర్హులన్నారు. ప్రధానంగా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఓవర్ లోడ్‌తో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాలతోనే 80శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప రవాణా శాఖ అధికారి (Deputy Transport Officer Durga Prameela) దుర్గా ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి (District Transport Officer uma Maheswara rao) ఉమా మహేశ్వరరావు, రవాణా శాఖ సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, ఎంవీఐలు పాల్గొన్నారు.