అక్షరటుడే, వెబ్‌డెస్క్:Uppal | బీర్ బాటిల్(Beer bottle)తో తలపై కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్(Uppal Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
రామంతపూర్‌లోని శ్రీ గుడ్ డే బార్(Sri Good Day Bar)లో అంబర్పేట్ పటేల్‌నగర్‌కు చెందిన హరి, పవన్, శ్రవణ్ అనే ముగ్గురు మిత్రులు మద్యం తాగారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయలో హరి, శ్రవణ్ గొడవపడ్డారు. వారిని ఆపడా నికి వెళ్లిన పవన్‌పై శ్రవణ్ బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.