అక్షర టుడే, నిజాంసాగర్: Jukkal Mandal | జుక్కల్ మండల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూర్బన్ పథకం (Rurban scheme) పనులు అసంపూర్తిగా నిలిచాయి. 2017- 18లో రూర్బన్ పథకం కింద ఎంపిక చేయగా. అప్పటి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (Zaheerabad Former MP Bibi Patil) చొరవతో నిధులు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంతో పనులు ముందుకు సాగడం లేదు.
Jukkal Mandal | నిలిచిన ఆడిటోరియం పనులు..
రూర్బన్ పథకం (Rurban scheme) కింద జుక్కల్ మండలంలో అంగన్వాడిల భవనాలు (Anganwadi buildings), పాఠశాలల్లో అదనపు గదులు, ప్రహరీలు, మరుగుదొడ్లు, బస్టాండ్ నిర్మాణం, మూత్రశాలలు, గ్రామ పంచాయితీలకు సొంత భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. గ్రామస్థాయిలో దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. కానీ మండల కేంద్రంలో రూ.కోట్ల నిధులతో చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచాయి.
జుక్కల్ మండల కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఆడిటోరియం పనులను (auditorium work) చేపట్టారు. ప్రస్తుత జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు (District In-charge Minister Jupally Krishna Rao) బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మంత్రి హోదాలో పనులు ప్రారంభించారు. కాగా, ఏడేళ్లు కావస్తున్నా.. పనులు పూర్తి కాలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పనులు మధ్యలోనే నిలిచినా పట్టించుకునే వారు లేరు.
Jukkal Mandal | నిధులు లేకనే…
- మధుబాబు, పంచాయతీరాజ్ శాఖ డీఈ
రూర్బన్ పథకం కింద ఆడిటోరియం పనులు చేపట్టారు. నిధుల విడుదలకు సంబంధించిన సమాచారం లేదు. నేను ఇటీవలే విధుల్లో చేరాను. ప్రస్తుతం నిధులు లేక పనులు సాగడం లేదు.