ePaper
More
    HomeజాతీయంCabinet Expansion | ఢిల్లీలో సీఎం బిజీబిజీ.. మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చేనా!

    Cabinet Expansion | ఢిల్లీలో సీఎం బిజీబిజీ.. మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చేనా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Cabinet Expansion | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్​(NITI Aayog) సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన.. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు, పార్టీ కార్యవర్గ కూర్పుపై వారు చర్చించినట్లు సమాచారం.

    Cabinet Expansion | ఆశావహుల నిరీక్షణ

    తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. మంత్రివర్గాన్ని విస్తరించలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యే(MLA)లు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్​లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పలువురు సీనియర్​ నాయకులు తమకు పదవి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. పదవులు తక్కువగా ఉండటం.. ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి రావడం లేదు.

    Cabinet Expansion | నేడు ఖర్గే, రాహుల్​తో సమావేశం

    సీఎం రేవంత్​రెడ్డి సోమవారం కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi)ని కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను ఆయన వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు లైన్​ క్లియర్​ అయినట్లు తెలిసింది. పీసీసీ కార్యవర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఖర్గే, రాహుల్​ను సీఎం కలిసిన అనంతరం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పదవులు ఎవరికి దక్కుతాయోనని కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...