అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Kalivi Kodi | సాధారణంగా కొన్ని సార్లు వింత పక్షులు, వింత జంతువులు కనిపిస్తూ Tirupati ఉంటాయి. అలాంటి వాటిలో కలివి కోడి(Kalivi Kodi) ఒకటి.
మూడు రోజుల క్రితం ఐఐటి, ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్(Tirupati Bird Atlas) వేదికపై దీనిమీద చర్చ జరిగింది. ఆంధ్రా బర్డర్స్ మీట్.. ఈ కలివి కోడి ఆవాసం, లభించిన ఆనవాళ్లను బయటపెట్టింది. ఈ విషయాన్ని ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి బర్డ్ అట్లాస్‌లో స్పష్టం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి ఆవాసంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరుగా మొత్తం 6 ప్రాంతాల్లో ఆధారాలు దొరికాయని, మరో 12 ప్రాంతాల్లో కలివి కోడి తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని వివరించారు.
Kalivi Kodi | భారీ ఖర్చు..
ఈ పక్షి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఏపీ(AP)లోని ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది.1986లో దీనిని చివరిసారిగా చూశారు. కనీసం ఎగరలేని ఈ చిట్టి పిట్ట కోసం అధికారులు ఒక అడవినే ఏర్పాటు చేశారు. అంతేకాదు.. రోజూ రాత్రి రోడ్డు కూడా మూసేస్తారు. 46 AM అప్పుడెప్పుడో 40 ఏళ్ల కిందట కడప జిల్లాలో కనిపించిన అత్యంత అరుదైన పక్షి కలివి కోడి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తుంది. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే కలివి కోడి పొదల్లో దాగి ఉంటుందని చెబుతున్నారు. పైకి ఎగరలేని పక్షి జాతి కలివి కోడిని.. అరుపులు, పాద ముద్రలు ఆధారంగా గుర్తిస్తారు. అరుదైన పక్షి జాతి Rare Bird అయిన కలివి కోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది.
2005 లోనే శేషాచలం Seshachalam ప్రాంతంలో కలివి కోడిని.. శాస్త్రవేత్త జగన్(Scientist Jagan) ఈ పక్షిని తన కెమెరాలో బంధించారు. ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి. మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగులో పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల పొదలు. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార అన్వేషణ వీటి ప్రత్యేక లక్షణం. దీని కూత ‘ట్విక్ టూ, ట్విక్ టూ’ అన్నట్లుగా ఉండి.. 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందట. ఈ పక్షి చూడ్డానికి కౌజు పిట్టలా ఉంటుంది.. మనిషి పిడికిలి అంత ఉంటుంది. గాల్లో ఎగరలేదు, కాలినడకన తిరుగుతుంది. 1986 తరువాత మళ్లీ కనిపించలేదు. దీని జాడ కనిపెట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు.