ePaper
More
    HomeసినిమాManchu Manoj | మంచు మ‌నోజ్ చేసిన ప‌నికి ఆ హీరో ఫోన్ నెంబ‌ర్ లీక్..!

    Manchu Manoj | మంచు మ‌నోజ్ చేసిన ప‌నికి ఆ హీరో ఫోన్ నెంబ‌ర్ లీక్..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Manchu Manoj | మంచు మ‌నోజ్ Manchu manoj చాలా రోజుల త‌ర్వాత భైర‌వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohit) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

    మే 30న మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భైరవం(Bhairavam) మూవీతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల ద్వారా భైరవంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. డైరెక్టర్ సంప‌త్ నంది, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతో సందడిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

    Manchu Manoj | ఫోన్ నెంబ‌ర్ లీక్..

    ఇక ఈ ఈవెంట్లో శింబుకి Simbu మనోజ్ ముందుగా ఫోన్ చేశాడు. అయితే మనోజ్ ఫోన్‌లో వాయిస్ తక్కువగా వినిపించింది. దీంతో అదితి ఫోన్ తీసుకుని.. అందులో శింబు నంబర్‌కి కాల్ చేశాడు. అందులో శింబు నంబర్‌ బయటకు కనిపించేలా ఫోన్ పట్టుకొని మాట్లాడాడు మనోజ్. అలా ఫోన్ నంబర్ లీక్ అయిన విషయాన్ని మనోజ్ గుర్తించాడు. మచ్చా.. ఫోన్ నంబర్ లీక్ అయినట్టుగా ఉంది.. నీకు ఓ కొత్త సిమ్ కార్డ్ పంపిస్తాను అని అన్నాడు మనోజ్. అది విన్న శింబు అయ్యో షాక్ అయ్యాడు. ఇక శింబు, మనోజ్ ఫోన్ కాల్‌లో సంభాషించారు.” నిన్ను చూస్తుంటే నాకు జెలసీగా ఉంది.. కమల్ హాసన్ సర్‌తో నటించావ్.. అద్భుతంగా కనిపిస్తున్నావ్.. థగ్ లైఫ్‌కి ఆల్ ది బెస్ట్ మచ్చా” అని మనోజ్(Manoj) అన్నాడు.

    “మనోజ్ గురించి మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.. మనోజ్ చిన్న పిల్లాడి లాంటి వాడు.. మన ప్రేమను చూపిస్తే.. తిరిగి ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు.. కోపాన్ని చూపిస్తే.. అది మనకు ప్రాబ్లం అవుతుంది.. అందుకే మనోజ్‌ను ఎక్కువగా ప్రేమించాలి.. మనోజ్ లాంటి ఫ్రెండ్ నాకు దొర‌క‌డం నా అదృష్టం” అంటూ శింబు అన్నారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ ముగిసిన తరువాత సుమ కౌంటర్ వేసింది. మీరు ప్రేమను మాత్రమే తిరిగి ఇవ్వలేదు.. శింబు ఫోన్ నంబర్ Phone number కూడా అందరికీ తెలిసేలా చేశారు.. ఇంకా నయం.. ఆ నంబర్‌ను ఎవ్వరూ చూసి ఉండరు అని ఈవెంట్‌లో సుమ కౌంటర్ వేసింది.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...