visitors at zoo park
Zoo Park | జూ పార్క్​కు సందర్శకుల తాకిడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Zoo Park | వేసవి సెలవులు(Summer Holidays) వచ్చాయంటే పిల్లలకు హాయిగా గడుపుదాం అనుకుంటారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సరదాగా బయటకు వెళ్లడానికి ప్లాన్​ చేసుకుంటారు.

అయితే ఎండలకు భయపడి చాలా మంది టూర్లను క్యాన్సిల్​ చేసుకుంటారు. కాగా.. ఈ ఏడాది మే నెలలో ఎండల తీవ్రత అంతగా లేకపోవడంతో చిన్నారులతో తల్లిదండ్రులు సమ్మర్​ హాలీడేస్​ ఎంజాయ్​ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు.

వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో హైదరాబాద్ (Hyderabad)​లోని నెహ్రూ జూ పార్క్‌ (Nehru Zoo Park hyderabad)కు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. వాతావరణం చల్లగా ఉండటంతో పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు జంతు ప్రదర్శన శాలకు వచ్చారు. అత్యధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూ పార్క్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నారులు పార్కులోని జంతువులను చూసి సరదాగా గడిపారు. అంతేగాకుండా నగరంలోని లుంబిని పార్క్ lumbini park​, ఎన్టీఆర్​ పార్క్​ ntr park, నెక్లెస్​ రోడ్డు nekles road ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ అధికంగా ఉంది.