ePaper
More
    HomeతెలంగాణJagga Reddy | క‌విత లేఖ‌తో బీజేపీకే లాభం.. కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి

    Jagga Reddy | క‌విత లేఖ‌తో బీజేపీకే లాభం.. కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jagga Reddy | బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె ముద్దుల త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) రాసిన లేఖ అంతిమంగా బీజేపీకే ల‌బ్ధి చేకూర్చేలా ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి అన్నారు. ప్ర‌స్తుత పరిణామాల‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన త‌న తండ్రికి లేఖ రాశార‌ని, డిప్రెష‌న్‌లో లేఖ విడుద‌ల చేసింద‌న్నారు. ఆదివారం జ‌గ్గారెడ్డి(Jagga Reddy) విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కవిత లేఖలతో కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఆమె చర్యలు బీజేపీ(BJP) ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ను చంపడం, బతికించుకోవడం వాళ్ళ వ్యక్తిగతమని, కవిత లేఖ వల్ల బీఆర్ఎస్(BRS) ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయిందని చెప్పారు. కవిత వల్ల ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నారు.

    Jagga Reddy | బ‌ల‌వంతురాలే కాదు..

    క‌విత(Kavitha) స‌హ‌జంగా ఎదిగిన నాయకురాలు కాద‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. ఆమె తండ్రి చాటు బిడ్డగా లీడర్ అయిందని, డైరెక్ట్ లీడర్ కాలేద‌ని తెలిపారు. క‌విత రాజకీయంగా బలవంతురాలు కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టినా దాన్ని న‌డ‌ప‌డం అంత ఈజీ కాద‌ని వ్యాఖ్యానించారు. క‌విత చ‌ర్య‌ల వ‌ల్ల కాంగ్రెస్‌(Congress)కు న‌ష్టం లేక‌పోయినా బీజేపీకి మాత్రం ప్ర‌యోజనం ద‌క్కుతుంద‌న్నారు.

    Jagga Reddy | కేసీఆర్‌ను స‌మాధి చేసే య‌త్నం

    కేసీఆర్(KCR) కుటుంబంలో, పార్టీలో క‌విత లేఖ కలకలం రేపిందని జ‌గ్గారెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత అంశాలు ఉంటాయన్నారు అయితే, కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన్ని జీవ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన కోణంలోనే కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని, తర్వాత.. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి పట్టం కట్టారని తెలిపారు. ఏ చరిత్ర చూసుకున్నా కొడుకే వారసుడని గుర్తు చేశారు. మొత్తంగా క‌విత బీఆర్ఎస్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలం పెంచుతున్నారని తెలిపారు. కవిత రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించదని, కేసీఆర్ కూతురు కాబట్టే కవిత ఎపిసోడ్‌పై మీడియాకి ఆసక్తి అని స్పష్టం చేశారు.

    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖలో పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే, కవిత లేఖపై తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...