అక్షరటుడే, వెబ్‌డెస్క్ :India’s Diplomatic Victory | పాకిస్తాన్‌కు భారీ పరాభవం ఎదురైంది. ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (Organization of Islamic Countries)లో న్యూఢిల్లీకి భారీ దౌత్య విజయం లభించింది.
పాకిస్తాన్ తీసుకొచ్చిన భారత వ్యతిరేక ప్రతిపాదనను ఇండోనేషియా, ఈజిప్ట్, బహ్రెయిన్ వంటి దేశాలు అడ్డుకున్నాయి. జకార్తాలో జరిగిన OIC సమావేశంలో.. కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ (Pakistan) భారతదేశంపై కఠినమైన వైఖరిని అవలంబించాలని ప్రతిపాదించింది. ఇండియాను ఇరుకున పెట్టడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఇండోనేషియా, ఈజిప్ట్, బహ్రెయిన్ ముస్లిం దేశాలు విఫలం చేశాయి. తద్వారా అవి భారత్(Bharath)కు అండగా నిలిచాయి. మరోవైపు, OICలో పాకిస్తాన్ ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల ఇస్లామిక్ దేశాలలో ఆ దేశ పరువు గంగలో కలిసింది.
India’s Diplomatic Victory | ఆ మూడు దేశాలదే ముఖ్యపాత్ర
OIC సమావేశంలో పాకిస్తాన్ తీసుకొచ్చిన భారత వ్యతిరేక ఎజెండాను భగ్నం చేయడంలో ఇండోనేషియా, ఈజిప్ట్, బహ్రెయిన్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. జకార్తాలో జరిగిన సమావేశంలో భారతదేశం(India)పై విజయం సాధించామని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాస్తవం ఏమిటంటే OICలో కాశ్మీర్ పై పాకిస్తాన్ ఎజెండా దారుణంగా విఫలమైంది.
India’s Diplomatic Victory | పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బ
ఇండియాకు మద్దతుగా ముస్లిం దేశాలు(Muslim countries) నిలువడం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇండోనేషియా చాలా సంవత్సరాలుగా కాశ్మీర్‌పై భారత వైఖరికి మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు, ఇండియా నుంచి బ్రహ్మోస్ క్షిపణి(Brahmos missile)ని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకు రావడంతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది.
ఇక, ఈజిప్ట్ కూడా ఇండియాతో తన రక్షణ, పెట్టుబడి, కనెక్టివిటీ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంగా బహ్రెయిన్(Bahrain)తో భారత్ సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. ఇండోనేషియా తన ప్రాదేశిక సమగ్రతకు చాలా శ్రద్ధ చూపుతోంది. దీనికి కారణం పాపువాలో దీనికి ఇలాంటి అనుభవం ఉంది. ఇండోనేషియా తరచుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, రాడికల్ భావజాలంపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అందువల్ల, ఉగ్రవాదంపై పోరాడే అంశంపై ఇండియా, ఇండోనేషియా చాలా సారూప్య అభిప్రాయాలను కలిగి ఉన్నాయి.
India’s Diplomatic Victory | అయినా బుద్ధి మారలే
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్(Pakistan)కు ఎంతకీ బుద్ధి రావడం లేదు. ముస్లిం దేశాలే ఛీత్కరిస్తున్నా దాయాది వైఖరిలో మార్పు రావట్లేదు. మొన్నటి భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు గాను ఇండోనేషియా అధ్యక్షుడు.. పాకిస్తాన్‌లో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ పాక్‌కు కనీసం చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి (Terrorist Attack) తర్వాత న్యూయార్క్‌లో OIC సమావేశంలో కాశ్మీర్‌పై కఠినమైన పదాలను ఉపయోగించేందుకు యత్నించగా ఒమన్ ఆపడానికి ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో పాక్‌పై ఇండియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇస్లామాబాద్ OIC సమూహాన్ని తప్పుదారి పట్టించిందని, కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులపై ఏకపక్ష ప్రకటన విడుదల చేసిందని పేర్కొంది. తాజాగా కూడా పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యపై భారతదేశాన్ని ఇరుకున పెట్టాలని కోరుకుంది. కానీ ఇండోనేషియా, ఈజిప్ట్, బహ్రెయిన్ దాని చర్యను తిప్పికొట్టాయి. దీంతో అవమాన భారంతో పాక్ ముఖం వాడిపోయింది.