అక్షరటుడే, నిజాంసాగర్: MLA Thota Lakshmi Kantha rao | మండలంలోని మాగి గ్రామంలో (Magi Village) ఆదివారం బోనాల ఉత్సవాలు (Bonalu Festival) వైభవంగా జరిగాయి.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు jukkal mla thota Lakshmi Kanth rao పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లనిచూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ (Pitlam AMC Chairman Manoj) మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు శ్రీనివాస్, మెంగారం శ్రీనివాస్, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.