ePaper
More
    Homeటెక్నాలజీLava shark 5g | తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ దేశీ ఫోన్‌.. ధర ఎంతంటే..!

    Lava shark 5g | తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ దేశీ ఫోన్‌.. ధర ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Lava shark 5g | ప్రముఖ దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ (Domestic smart phone) తయారీ కంపెనీ అయిన లావా తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌(5G Smart Phone)ను తీసుకువచ్చింది. లావా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఒక సంవత్సరం పాటు ఉచిత డోర్‌ స్టెప్‌ సర్వీస్‌(Free doorstep service)ను కూడా అందిస్తుంది. ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్‌తో రెడ్‌మీ, రియల్‌మీ వంటి చైనీస్‌ బ్రాండ్‌లకు పోటీగా తీసుకువచ్చిన ఈ మోడల్‌ ధర, స్పెసిఫికేషన్స్‌ చూసేద్దామా..


    డిస్‌ప్లే

    6.75 అంగుళాల HD + డిస్‌ప్లే. 90 Hz రిఫ్రెష్‌ రేట్‌. వాటర్‌ డ్రాప్‌ నాచ్‌, 2.5డీ స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌.

    ప్రాసెసర్‌

    Unisoc T765 ఆక్టా కోర్‌ (6ఎన్‌ఎం) ప్రాసెసర్‌.
    ఆపరేటింగ్‌ సిస్టం
    ఆండ్రాయిడ్‌ 15 OS.
    వేరియంట్‌
    4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంది. మైక్రో ఎస్‌డీ ద్వారా స్టోరేజీని 8 GB ర్యామ్‌ వరకు ఎక్స్‌టెండ్‌ చేసుకోవచ్చు. ధర రూ. 7,999.

    కెమెరా

    వెనకభాగంలో 13 MP ఏఐ బ్యాక్డ్‌ డ్యుయల్‌ కెమెరా సెటప్‌. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 MP కెమెరా.

    బ్యాటరీ
    5000 mAh. 18w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌.

    అదనపు ఫీచర్లు
    సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింగ్‌ సెన్సార్‌, ఐపీ 54 డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌.
    కలర్స్‌
    స్టెల్లార్‌ గోల్డ్‌, స్టెల్లార్‌ బ్లూ.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...