అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Suzuki | ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric scooters) విభాగంలోకి ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన సుజుకీ మోటార్ సైకిల్(Suzuki Motorcycle) ఇండియా ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. తన పాపులర్ స్కూటర్ అయిన యాక్సెస్‌లో ఈవీ వేరియంట్‌ను తీసుకురావాలని నిర్ణయించింది.
ఇప్పటికే గురుగ్రామ్‌లోని ప్లాంట్‌లో ఈవీ వేరియంట్ (ఈ-యాక్సెస్ స్కూటర్) తయారీని ప్రారంభించినట్లు తెలిపింది. దీర్ఘ కాల మన్నిక అత్యుత్తమ థర్మల్ స్టెబిలిటీతో కూడిన ఇ-టెక్నాలజీ(E-Technology)తో ఈ విద్యుత్ స్కూటర్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్ వచ్చేనెల(Next month)లో లాంచ్ కానుంది. ధర రూ.1.20 లక్షలు(ఎక్స్ షోరూం ధర) ఉండే అవకాశాలున్నాయి. హోండా ఇ- యాక్టివా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చెతక్, ఏథర్ రిజ్టా, ఓలా ఎలక్ట్రిక్‌లకు పోటీ ఇస్తుందని భావిస్తున్న ఈ మోడల్ ఫీచర్లేమిటో తెలుసుకుందామా..
Battery :
3.07 kWh లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఇది నికెల్ మాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీలకంటే రెండుమూడు రెట్ల మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
చార్జింగ్ టైమ్ :
పోర్టబుల్ చార్జర్(Portable Charger)తో 6 గంటల 12 నిమిషాల్లో ఫుల్ చార్జ్(Full charge) అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ చార్జర్‌తో అయితే 2 గంటల 12 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుందని పేర్కొంది.
Suzuki | రేంజ్ : 95 కిలోమీటర్లు.
డ్రైవ్ మోడ్స్ : రివర్స్ మోడ్(Reverse mode)తోపాటు వివిధ రకాల రైడింగ్ మోడ్(ఎకో, రైడ్ ఏ, రైడ్ బీ)లతో ఈ మోడల్ రానుంది.
Sefty features : సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 65 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో ఒకవైపు ఒరిగినపుడు డ్రైవ్ పవర్‌ను నిలిపివేస్తుంది. ఇందులోని రీ జెనరేటివ్ బ్రేకింగ్ బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంది.
Suzuki | ఇతర ఫీచర్స్..
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ(Smartphone connectivity)తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ కన్సోల్. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, మెస్సేజ్, వాట్సాప్ అలర్టులు, వేగ పరిమితి హెచ్చరికలు, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లున్నాయి.