అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Rajnath Singh | పహల్గామ్ ఉగ్రవాద దాడికి Pahalgam terror attack పాల్పడిన వారికి, తెర వెనుక ఉన్న వారికి తగిన రీతిలో బదులిస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Union Defence Minister Rajnath Singh హెచ్చరించారు. వారికి భారతదేశం నుంచి “బిగ్గరగా, స్పష్టమైన” “loud and clear” ప్రతిస్పందన త్వరలో లభిస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని Jammu and Kashmir పహల్గామ్లో Pahalgam ఉగ్రదాడికి పాల్పడిన ఘటనలో 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని రాజ్‌నాథ్ సింగ్ Rajnath Singh ఈరోజు సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ National Security Advisor Ajit Doval, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ Army Chief General ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ Navy Chief Admiral దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే సింగ్ పాల్గొన్నారు.
Minister Rajnath Singh | ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం..
ఉగ్రవాదాన్ని terrorism తుదముట్టించాలనేదే భారత్ india అభిమతమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను terrorists ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం central government అండగా ఉంటుందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు. భారత్‌పై india కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమని, తగిన రీతిలో ప్రతి స్పందన వస్తుందని హెచ్చరించారు.
Minister Rajnath Singh | ఎవ్వరినీ వదలబోమన్న రాజ్‌నాథ్
దాడి చేసిన వారిని, దాని వెనుక ఉన్న సూత్రధారులకు భారత్ తగిన రీతిలో బదులిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ Defence Minister Rajnath Singh తెలిపారు. “నిన్న పహల్గామ్లో Pahalgam ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు ఒక పిరికి చర్యకు పాల్పడ్డారు. దీనిలో మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయాము. ప్రభుత్వం governament అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న నటులను కూడా చేరుకుంటాము. నిందితులు త్వరలో బిగ్గరగా, స్పష్టమైన ప్రతిస్పందనను చూస్తారని నేను దేశానికి భరోసా ఇస్తున్నానని” సింగ్ అన్నారు.