ePaper
More
    HomeతెలంగాణJagga Reddy | కవిత లేఖతో బీఆర్​ఎస్​కే నష్టం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

    Jagga Reddy | కవిత లేఖతో బీఆర్​ఎస్​కే నష్టం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇటీవల తన తండ్రికి రాసిన లేఖతో బీఆర్​ఎస్(BRS)​ పార్టీకే నష్టమని కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. కవిత లేఖపై ఆయన స్పందించారు. అది వారి కుటుంబ వ్యవహారం అని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని పేర్కొన్నారు.

    Jagga Reddy | కాంగ్రెస్​ బలంగా ఉంది

    రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కవిత లేఖతో తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. బీఆర్​ఎస్​ ఉద్యమ పార్టీగా అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్(Congress)​ పరిపాలన దక్షతతో విజయం సాధించిందన్నారు. మతం, హిందుత్వం పేరుతో బీజేపీ కేంద్రంలో గెలిచిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ మొదటి స్థానంలో ఉంటే.. బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు.

    Jagga Reddy | బీజేపీలోకి వలసలు

    కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీంతో గులాబీ నాయకులు బీజేపీ(BJP)లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం(KCR Family)లో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదన్నారు. కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుందని వ్యాఖ్యానించారు.

    Jagga Reddy | బీజేపీకి లాభం

    కవిత తీరుతో రాష్ట్రంలో బీజేపీకి లాభం జరుగుతుందన్నారు. దేవుడు అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉందని విమర్శించారు. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా తాము ప్లాన్ అమలు చేస్తామని జగ్గారెడ్డి అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు, సీఎంతో మాట్లాడుతానని పేర్కొన్నారు.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్ గణేష్ మండలి వద్ద సీపీ ప్రత్యేకపూజలు

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో (Police Headquarters) ఏర్పాటు...

    Shreyas Iyer | శ్రేయస్ అయ్య‌ర్‌కి ప్ర‌మోష‌న్.. ఆస్ట్రేలియా సిరీస్‌కి కెప్టెన్‌గా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shreyas Iyer | ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కించుకోని భారత వెటరన్...

    Sriramsagar Project | శ్రీరాంసాగర్ ఎస్కేప్ గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి వరద(Flood) కొనసాగుతోంది. అయితే...