అక్షరటుడే, వెబ్డెస్క్: ECET Results | టీజీ ఈసెట్ (TG ECET) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) ప్రధాన భవనంలో TGCHE ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్(B.Tech), బీఫార్మసీ(B.Pharmacy) కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న ఈసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. హాల్టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
https://ecet.tgche.ac.in/TGECET/TGECET_RankCard_2025_GET.aspx