ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | ఎమ్మెల్సీ కవిత మరో షర్మిల.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత మరో షర్మిల.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్​(MP Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు, పదవుల పంపకాల్లో కవితకు, కేటీఆర్​కు తేడాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. దీంతోనే కవిత తన తండ్రికి లేఖ(Kavitha Letter) రాశారని పేర్కొన్నారు. కవిత మరో షర్మిల కాబోతుందుని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కవిత తన తండ్రి కేసీఆర్​కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్​ స్పందించారు.

    MLC Kavitha | అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెట్టాయి

    ఎంపీ లక్ష్మణ్​ మాట్లాడుతూ.. గతంలో వైఎస్​(YSR) కుటుంబంలో కూడా ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడా రావడంతో షర్మీల (Ys Sharmila) పార్టీ పెట్టిందని గుర్తు చేశారు. గతంలో అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు వారిపైనే గురి పెట్టాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

    MLC Kavitha | కవిత కుట్రలు పనిచేయవు

    బీఆర్​ఎస్​లో కేటీఆర్(KTR leadership)​ నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. అయితే పార్టీలో కవిత కుట్రలు పని చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదని.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్​తో కలిసి కుట్ర చేస్తోందన్నారు. షర్మిలను కూడా కాంగ్రెస్‌ ఇలానే వాడుకుందని ఆయన ఆరోపించారు.

    కేవలం తన సొంత ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో జైలుకు వెళ్లొచ్చిన కవితను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కవితకు సానుభూతి కూడా రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలపడుతుండటంతోనే కాంగ్రెస్​, కవిత కలిసి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...