ePaper
More
    HomeజాతీయంSupreme Court | లైంగిక విద్యపై విధానాన్ని రూపొందించండి.. కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

    Supreme Court | లైంగిక విద్యపై విధానాన్ని రూపొందించండి.. కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Supreme Court | కౌమార ద‌శ‌లో చేసే ఏకాభిప్రాయంతో చేసే శృంగార కార్య‌క‌లాపాలను నేరంగా ప‌రిగ‌ణించి పోక్సో చ‌ట్టం (POCSO Act) కింద జైలుకు పంపే అంశాన్ని పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సుప్రీంకోర్టు (Suprem Court) అభిప్రాయ‌ప‌డింది. ఏకాభిప్రాయంతో శృంగార సంబంధాలలో ఉన్న కౌమారదశలో ఉన్నవారిని జైలుకు (Jail) పంపకుండా చూసుకోవడానికి, అటువంటి ఏకాభిప్రాయంతో జ‌రిగే లైంగిక‌ సంబంధాలను లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (Protection of Children) (పోక్సో) కింద నేరంగా పరిగణించడంపై పున‌రాలోచ‌న చేయాల్సి ఉంద‌ని తెలిపింది. అందుకోసం దేశంలో లైంగిక‌, పున‌రుత్ప‌త్తి ఆరోగ్య విద్య కోసం ఒక విధానాన్ని రూపొందించాల‌ని సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది (Supreme Court has directed the central government). 14 సంవత్సరాల వయస్సులో తనతో లైంగిక సంబంధం కలిగి ఉన్నందుకు గాను పోక్సో కింద 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన తన భర్తను రక్షించాల‌ని పశ్చిమ బెంగాల్‌కు (West Bengal) చెందిన ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం నేప‌థ్యంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జ‌స్టిస్‌ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈమేర‌కు ఆదేశాలు జారీ చేసింది.

    కౌమార ద‌శ‌లో ఏకాభిప్రాయంతో చేసే శృంగార కార్య‌క‌లాపాల‌ను నేరంగా ప‌రిగ‌ణించి జైలుకు పంపించడంతో పాటు లైంగిక‌, పున‌రుత్ప‌త్తి ఆరోగ్య విధాన రూప‌క‌ల్ప‌న‌పై నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ఈ క‌మిటీ జూలై 25 నాటికి త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని గ‌డువు విధించింది. నివేదిక వ‌చ్చిన‌ తర్వాత మరిన్ని ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.

    Supreme Court | సుప్రీం అరుదైన తీర్పు

    బెంగాల్‌కు చెందిన 14 సంవత్సరాల బాలిక‌తో ఓ వ్య‌క్తి ప‌ర‌స్ప‌ర ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, బాలిక‌తో సెక్స్‌లో పాల్గొన్నందుకు పోలీసులు పోక్సో కేసు (POCSO case) పెట్టి జైలుకు పంపించారు. విచార‌ణ జ‌రిపిన ట్ర‌య‌ల్ కోర్టు (trial court) నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితుడు బెంగాల్ కోర్టును (Bengal court) ఆశ్ర‌యించ‌గా, న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. బాలిక త‌న స‌మ్మ‌తితోనే శృంగారంలో పాల్గొన్న‌ద‌ని, తాను ఏం చేస్తున్న‌దో ఆమెకు స్ప‌ష్ట‌త ఉన్న‌ద‌న్న బెంగాల్ హైకోర్టు (Bengal High Court).. నిందితుడికి కింది కోర్టు విధించిన జైలుశిక్ష‌ను ర‌ద్దు చేసింది. అయితే, హైకోర్టుపై తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డంతో సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా విచార‌ణ చేప‌ట్టింది. అదే స‌మ‌యంలో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ బెంగాల్ ప్ర‌భుత్వం (Bengal government) సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఇటీవ‌ల అరుదైన తీర్పు వెలువ‌రించింది. నిందితుడ్ని దోషిగా తేల్చిన కోర్టు.. శిక్ష మాత్రం వేయ‌లేదు. బాధితురాలిని పెళ్లి చేసుకుని బిడ్డ‌ను క‌న్నందుకు గాను, ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా త‌న విచ‌క్ష‌ణాధికారాలను ఉప‌యోగించి ఈ తీర్పు ఇస్తున్న‌ట్లు తెలిపింది.

    Supreme Court | ప్రేమ సంబంధాలు నేరం కాదు..

    ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన వాద‌నలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. సున్నితమైన అంశంపై సహాయం చేయడానికి బాధితురాలి కోసం సుప్రంకోర్టు (Supreme Court) ఇద్దరు సీనియర్ మహిళా న్యాయవాదులు మాధవి దివాన్, లిజ్ మాథ్యూ నియమించింది. విచార‌ణ సంద‌ర్భంగా త‌మ వాద‌న‌లను బ‌లంగా వినిపించిన మ‌హిళా న్యాయ‌వాదులు.. ఏకాభిప్రాయ సంబంధాలలో ఉన్న కౌమారదశలో ఉన్నవారిని రక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. లైంగిక దోపిడీ నుంచి మైనర్లను రక్షించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం (POCSO Act) ప్ర‌ధాన‌ ప్రయోజనాన్ని అందించినప్పటికీ, కౌమార సంబంధాల కేసులలో పోక్సో కఠినమైన వైఖ‌రి బాధితురాలిపై ఆధారపడిన వారి ప్రయోజనాలకు అనుగుణంగా లేని ఫలితాలకు దారితీయవచ్చని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోక్సో చ‌ట్టం ప్ర‌కారం బ‌ల‌వంతంగా చేసే శృంగారం నేర‌మేన‌ని, అదే స‌మ‌యంలో ఏకాభిప్రాయంతో జ‌రిగే సంభోగాన్ని అత్యాచారంగా ప‌రిగ‌ణించాలేమ‌న్న కోల్‌క‌తా హైకోర్టు (Kolkata High Court) తీర్పును ఉటంకించారు. ఢిల్లీ, మద్రాస్‌ (Delhi and Madras) సహా వివిధ హైకోర్టులు పోక్సో చట్టం లక్ష్యాలు, కారణాల ప్రకటనను గుర్తించాయ‌ని, అదే స‌మ‌యంలో ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణించకూడదని తెలిపాయ‌ని న్యాయవాదులు ఎత్తి చూపారు. సీనియర్ న్యాయవాదుల (senior lawyers) సూచనలను అంగీకరించిన న్యాయ‌స్థానం.. ఈ కేసులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

    Supreme Court | నివేదిక త‌ర్వాత చ‌ర్య‌లు..

    ఈ అంశంపై త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌ని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయ‌ప‌డింది. “విద్యార్థుల స్నేహితుల సూచనను ముందుకు తీసుకెళ్లడానికి, మరింత ప్రభావవంతమైన ఉత్తర్వులు జారీ చేయడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development) ద్వారా కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తున్నామ‌ని ” పేర్కొంది. నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. “అమిక‌స్ క్యూరీ సూచనలను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిపుణుల కమిటీని నియమిస్తారు. రాష్ట్రంలోని సీనియర్ అధికారులు (Senior officers) కమిటీలో భాగం అవుతారు. అవసరమైతే, కమిటీ అమిక‌స్ క్యూరీగా నియమించిన సీనియర్ న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు. నోటీసు అందిన వెంటనే, కార్యదర్శి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. క‌మిటీ పూర్తిగా విచారించి నివేదిక అందిస్తే త‌గిన ఆదేశాలు జారీ చేస్తామ‌ని” అని ధర్మాసనం పేర్కొంది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...