అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల(tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా విదేశాల నుంచి సైతం భారీగా భక్తులు తరలి వస్తారు. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ(TTD) అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అంతేగాకుండా భక్తులకు శ్రీవారి సేవ చేయడానికి అవకాశం ఇస్తోంది. దీంతో ఎంతో మంది భక్తులు స్వామి వారి సేవలో తరిస్తుంటారు. అయితే ఈ సౌకర్యం దేశంలోని భక్తులకు మాత్రమే ఉంది. తాజాగా టీటీడీ ఎన్నారై భక్తులకు సైతం స్వామి సేవలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
ఎన్నారై(NRI’s)లు కూడా శ్రీవారి సేవ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala rao) తెలిపారు. గోమాత సేవ చేసేందుకు కొత్తగా ‘గో సేవ’ను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో టీటీడీ అధికారులు వర్చువల్గా సమావేశం నిర్వహించారు. మెడిసిన్, ఐటీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో సేవలందించేందుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారని ఈవో తెలిపారు. వారి సేవలను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.