అక్షరటుడే, వెబ్ డెస్క్: Bitter Gourd | కూరగాయాల్లో చాలా మందికి నచ్చనిది కాకరకాయ. చూడడానికి వికారంగా, తినడానికి చేదుగా ఉంటుందని భావిస్తారు. అసలు నోట్లో పెట్టడానికి కూడా చాలా మంది ఇష్టపడారు. కానీ, ఆరోగ్యానికి కాకర చేసే మేలు తెలిస్తే ఎవరైనా సరే లొట్టలేసుకుని తినాల్సిందే. కాకరకాయ తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రధానంగా డయాబెటిస్(Diabetes), అధిక యూరిక్ యాసిడ్(Uric acid) వంటి ముప్పును తగ్గించుకోవచ్చు. మందులతో పని లేకుండా కాకరకాయతో ఈ రెండు సమస్యలకూ చెక్ పెట్టుకోవచ్చు. కాకరకాయ(Bitter Gourd)ను ఆహారంలో భాగం చేసుకుంటే యూరిక్ యాసిడ్ కారణంగా వచ్చే గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ స్టోన్స్(Kidney stones), ఆర్థరైటిస్(Arthritis) వంటి వ్యాధులతో పాటు షుగర్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Bitter Gourd | ఎన్నో పోషకాలు..
చేదుగా ఉన్నప్పటికీ కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, బీటా-కెరోటిన్(Beta-carotene), పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కాకరకాయకు యూరిక్ యాసిడ్, డయాబెటిస్(Diabetes)లను నియంత్రించే లక్షణాలుంటాయి. యూరిక్ యాసిడ్(Uric acid) వంటి ముప్పును ఒక గ్లాసు కాకరకాయ తీసుకోవడం ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు.
Bitter Gourd | షుగర్‌కు చెక్..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా కాకరకాయ(Bitter gourd) చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. చేదుగా ఉండే ఆకుపచ్చని కాకరలో విటమిన్ A, C, బీటా-కెరోటిన్, ఇతర ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు(Suger level) పెరగకుండా నివారిస్తుంది.
Bitter Gourd | జ్యూస్ చాలా బెటర్..
కాకరకాయకను వివిధ రకాల్లో తీసుకోవచ్చు. ప్రధానంగా జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ముప్పులను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో అర కప్పు కాకరకాయ రసం తాగితే చాలా మంచిది. చేదును తొలగించడానికి కొద్దిగా నల్ల ఉప్పు లేదా నిమ్మకాయ కలుపుకోవాలి. దీని వల్ల గౌట్, ఆర్థరైటిస్ సమస్యలు రావు. కాకరకాయను వండుకుని తినవచ్చు. కాకరకాయను కోసి నీడలో ఆరబెట్టి మెత్తటి పొడి చేసుకోండి. ఈ పొడిని ప్రతి ఉదయం సగం లేదా ఒక టీస్పూన్ నీళ్లలో వేసుకుని తాగాలి. దీని ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించుకోవచ్చు.