ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Health tips | బ‌రువు త‌గ్గ‌డం చాలా ఈజీ.. ఈ చిట్కాలు పాటిస్తే వెయిట్ లాస్...

    Health tips | బ‌రువు త‌గ్గ‌డం చాలా ఈజీ.. ఈ చిట్కాలు పాటిస్తే వెయిట్ లాస్ ప‌క్కా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Health tips | ఆధునిక జీవ‌న విధానం మ‌రీ సుల‌భ‌త‌ర‌మై పోయింది. శారీర‌క శ్ర‌మ త‌గ్గిపోయింది. ఆహార అల‌వాట్ల‌(Food habits)లో విప‌రీత‌మైన మార్పు వ‌చ్చింది. కూర్చున్న ద‌గ్గ‌ర‌కే అన్నీ వ‌చ్చి వాలుతున్నాయి. దీంతో చాలా మంది ఊబ‌కాయం(Obesity), స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌తో, అధిక బ‌రువుతో బాధ ప‌డుతున్నారు. గుదిబండ‌లా మారిన శ‌రీరాన్ని నాజుగ్గా త‌యారు చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. జిమ్‌లు(Gyms), యోగా సెంటర్ల(yoga centers)తో ప‌రుగులు పెట్ట‌డంతో పాటు పాటు కొవ్వు తొల‌గించే ఆధునిక వైద్య చికిత్స‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, బ‌రువు త‌గ్గ‌డానికి ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేద‌ని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకుంటే బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చని సూచిస్తున్నారు. ఫైబ‌ర్‌(Fiber), ప్రొటీన్స్(Proteins) పుష్క‌లంగా ఉండే వాటిని తిన‌డం ద్వారా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే శ‌రీరాకృతిలో మార్పులు క‌నిపిస్తాయ‌ని, బ‌రువు త‌గ్గ‌డం గ‌మ‌నిస్తార‌ని చెబుతున్నారు. ఫైబర్, ప్రోటీన్స్ ఉండే ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండుగా ఉన్న‌ట్లు అనిపించ‌డంతో పాటు వేగంగా బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయని వివ‌రిస్తున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి ఏయే ఆహార ప‌దార్థాలు, ఎలా తీసుకోవాలో డైటిషియ‌న్లు(Dietitians) చెప్పిన చిట్కాలు మీకోసం..

    Health tips | తాజా ఆకుకూరలు(Fresh greens)

    తాజా ఆకుకూర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండ‌డంతో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో అదనపు కేలరీలను పెంచకుండా ఇవి నియంత్రిస్తాయి. త‌ద్వారా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.

    Health tips | పెరుగు(Curd)

    పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గే సమయంలో కండరాలకు శక్తినిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే ప్రోబయోటిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

    Health tips | ఓట్స్(Oats)

    ఇది ఫైబర్‌తో కూడిన తృణధాన్యం. ఇందులో ముఖ్యంగా బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. రోజు ఉదయం ఓట్ మీల్‌ తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆక‌లిని నియంత్రిస్తుంది. రోజంతా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

    Health tips | ఎగ్స్‌(Eggs)

    గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన విటమిన్లు ఇందులో ఉంటాయి. అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల కడుపు నిండిన భావన హార్మోన్లను నియంత్రించడంలో ఎంతో ఉప‌క‌రిస్తుంది.

    Health tips | చియా, అవ‌కాడోలు..(Chia, avocados..)

    చియా గింజలు తింటే.. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవకాడోలో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ సంతృప్త, బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరరీంలో కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.

    Health tips | సిరిధాన్యాలు(Cereals)

    తృణ ధాన్యాలలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ ఉంటుంది. ఉదాలు, కొర్ర‌లు వంటి సిరిధాన్యాల‌ను తినడం వలన బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక‌ బెర్రీలు తీసుకోవ‌డం కూడా చాలా మంచింది. ఇందులో ఫైబర్, విటమిన్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇందులో కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో ఎక్కువ సమయం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం ద్వారా బ‌రువును నియంత్రించుకోవ‌చ్చు. అయితే, వీటిని తిన‌డంతో పాటు శారీరక శ్రమ క‌లిగించే ప‌నులు చేయ‌డం ద్వారా చాలా సులువుగా, వేగంగా బరువు తగ్గవ‌చ్చు.

    More like this

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...