అక్షరటుడే, వెబ్డెస్క్: Half day Work | రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు high temperatures భగ్గుమంటుండంతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట afternon బయటకు వెళ్లడం లేదు. అయితే పంచాయతీలో పని చేసే మల్టీపర్పస్ కార్మికులు multi purpose wo rkers నిత్యం ఎండలో సైతం పనులు చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో పంచాయతీ కార్మికులు Panchayat workers మధ్యాహ్నం పూట పనిచేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వారు ఒక పూట మాత్రమే పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్ని పంచాయతీల్లో పని చేసే మల్టీ పర్పస్ వర్కర్లకు ఒక్కపూట మాత్రమే పనిచేసేలా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ Panchayatraj director సృజన అన్ని జిల్లాల కలెక్టర్ల collectors కు ఉత్తర్వులు జారీ చేశారు. వేసవి దృష్ట్యా స్థానిక వాతావరణ పరిస్థితుల మేరకు పని వేళలు duty timings సర్దుబాటు చేయాలని ఆమె ఆదేశించారు. కార్మికులు ఆరోగ్యం కాపాడుతూనే, జీపీల పనులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో పంచాయతీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.