- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిOperation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్’కు ఉపాధ్యాయుల మద్దతు

Operation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్’కు ఉపాధ్యాయుల మద్దతు

- Advertisement -

అక్షరటుడే, బిచ్కుంద: Operation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్​’కు ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. బిచ్కుంద(Bichkunda) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తపస్ (TAPAS) ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ‘ఆపరేషన్​ సింధూర్​’తో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరణించిన వీర సైనికులకు పహల్గామ్​ (Pahalgam terror attack) పర్యాటకులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్, ఎన్నావార్ జనార్ధన్, తపస్ మండల అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి సందీప్, ఎస్జీటీ సంఘం ప్రతినిధులు విజయ్ పటేల్, ఖయ్యూం, తపస్ బాధ్యులు బస్వరాజ్​, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News