అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని రెండోటౌన్ పరిధిలో ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానిక వర్ని రోడ్ సమీపంలోని వైన్స్ పక్కన ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్కు శనివారం నలుగురు వ్యక్తులు రాగా.. బిల్లు చెల్లించే క్రమంలో ఘర్షణ తలెత్తింది. దీంతో అందులో పనిచేసే విజయ్ అనే వ్యక్తి మెడపై కత్తితో నలుగురు దాడిచేసినట్లు సమాచారం. ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులు, స్థానికులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలాన్ని పోలీసులు తనిఖీ చేసి, విచారణ చేపట్టారు.
