అక్షరటుడే, వెబ్డెస్క్: Missworld Issue | గత కొద్ది రోజులుగా హైదరాబాద్ (Hyderabad) వేదికగా అంతర్జాతీయ అందాల పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పోటీలలో (competitions) సంచలన పరిణామం చోటుచేసుకుంది. నిర్వాహకులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ దేశ అందగత్తె బహిష్కరిస్తూ స్వదేశానికి వెళ్లిపోవడం కలకలం రేపుతుంది. తనను వేశ్యగా పరిగణిస్తున్నారని మిస్ వరల్డ్ (Miss world) నిర్వాహకులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు (Miss World competition) వివాదాలకు కేంద్రంగా మారాయా? అన్న చర్చ నడుస్తోంది. మిల్లా మాగీ (Milla Magee) మొదట్లో తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలు అని చెప్పింది.
Missworld Issue | స్పందించిన సీఈవో..
అయితే ఆ తర్వాత ది సన్‌తో జరిపిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పోటీల సంస్థాపకులు తమను “వేశ్యలా” (Prostitute) భావించేలా చేశారని, పోటీదారులను గౌరవించకుండా “షో పీస్”లా (Show Piece) ప్రదర్శించారని ఆరోపించారు. పోటీదారులు ఉదయం నుంచి రాత్రి వరకు భారీ మేకప్, ఈవెనింగ్ గౌన్లు ధరించి ధనవంతులైన స్పాన్సర్లను ఆకర్షించేందుకు పరేడ్‌లా ప్రదర్శించారని ఆమె చెప్పారు. కేవలం ఆమె రూపాన్ని మాత్రమే ప్రదర్శించేందుకు ఒత్తిడి చేశారని చెప్పారు. ఈ పోటీ తమను అగౌరవంగా, వస్తువులా భావించేలా చేసిందన్నారు. నీతిలేని వ్యవస్థగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ షో వలన ఎలాంటి ఉపయోగం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించింది. మంచి చేయడం.. మార్పును ప్రోత్సహించడం.. మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశం. కానీ అది జరగదని మిస్ వరల్డ్ పోటీలను ఉద్దేశించి మిలా మ్యాగీ(Mila Magee) వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఆరోపణలని ఖండించింది. సంస్థ సీఈవో జూలియా మోర్లీ(CEO Julia Morley). ముందు ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుంచి వైదొలిగింది. ఇంగ్లండ్ (England) వెళ్లిన తర్వాత తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో వైదొలిగినట్లు బ్రిటన్ మీడియాకు మ్యాగీ చెబుతుంది. మ్యాగీ ఆరోపణల్లో నిజం లేదు. హైదరాబాద్‌లో(Hyderabad) ఉండగా తాను ఈవెంట్ అద్భుతంగా జరుగుతుందని చెప్పుకొచ్చిందని నిర్వాహకులు అన్నారు. అలానే హైదరాబాద్‌లో ఉండగా రికార్డు చేసిన వీడియో స్టేట్మెంట్లు (video statements) రిలీజ్ చేస్తున్నారు.