Railway gateman
Railway gateman | రైల్వే గేట్​మన్​ ఆత్మహత్య

అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బిచ్కుందలో జరిగింది. ఎస్సై మోహన్‌రెడ్డి (SI Mohan Reddy) కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సునీల్, తన భార్య జ్యోతితో కలిసి బైక్‌పై శుక్రవారం బిచ్కుందకు వస్తుండగా, ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి జ్యోతి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భార్య మృతిని జీర్ణించుకోలేని సునీల్‌ అదేరోజు యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.