ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలి

    Indiramma Housing Scheme | నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Housing Scheme | ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) సూచించారు. శనివారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఐదు విడతల్లో నిర్మించుకున్న విధంగా బిల్లులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ (Chairman of Agro Industries) కాసుల బాలరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు నార్ల సురేష్, ఎజాజ్, ఖాలెక్ తదితరులు పాల్గొన్నారు.

    Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

    పట్టణంలోని కోటగల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన వారు ఇళ్లు కట్టుకునేందుకు ముందుకొస్తే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఖాలెక్, రోహిత్, నార్ల సురేష్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...