అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal Suryanarayana Gupta | మహిళా శక్తికి నిదర్శనం అహల్యాబాయ్ హోల్కర్ (Ahilyabai Holkar) అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) కొనియాడారు. శనివారం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశమంతా పర్యటించి అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు.
1780లో కాశీ విశ్వనాథ ఆలయం (Kashi Vishwanath Temple) పునరుద్ధరణలో ఆమె కృషి ఉందన్నారు. అహల్యబాయి పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవళిక, స్రవంతి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.