Literacy Rate
Literacy Rate | అక్ష‌రాస్య‌త‌లో తెలుగు రాష్ట్రాలు వ‌ర‌స్ట్‌.. మిజోరం ఫ‌స్ట్‌.. ఏపీ లాస్ట్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Literacy Rate | అక్ష‌రాస్య‌త రేటులో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు బాగా వెనుక‌బ‌డ్డాయి. అక్ష‌రాస్య‌త జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra preadesh) చివ‌రి స్థానంలో నిలవ‌గా, తెలంగాణ (Telangana) ఆరో స్థానంలో నిలిచింది. ఇది తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల (Telugu state governament) వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపుతోంది. మ‌రోవైపు, దేశంలో అత్య‌ధిక అక్ష‌రాస్య‌త సాధించిన రాష్ట్రంగా ఈశాన్య ప్రాంతానికి చెందిన మిజోరం(Mizoram) మొద‌టి స్థానంలో నిలిచింది. 76.32 శాతం లిట‌ర‌సీ రేటు సాధించి ఫ‌స్ట్ ప్లేస్ సాధించ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో పూర్తి అక్ష‌రాస్య‌త హోదాను సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి లాల్దు హోమా రెండ్రోజుల క్రితం ప్ర‌క‌టించారు. ఇది విద్యామంత్రిత్వ శాఖ (Ministry of Education) నిర్దేశించుకున్న 95 శాతం అక్ష‌రాస్య‌త రేటు ప‌రిమితిని అధిగ‌మించింద‌ని చెప్పారు.

Literacy Rate | వెనుక‌బ‌డ్డ తెలుగు రాష్ట్రాలు

స్వాతంత్య్రానంత‌రం ఇండియాలో అక్ష‌రాస్య‌త రేటు (India literacy rate) బాగా పెరిగింది. అప్ప‌ట్లో అక్షరాస్యత రేటు కేవలం 14% మాత్రమే ఉండ‌గా, ఆ త‌ర్వాతి రోజుల్లో బాగా మెరుగుప‌డింది. ఇప్పుడు దాదాపు 76.32 శాతం అక్షరాస్యత రేటును (literacy rate) సాధించిందని అధికారిక లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు (Telugu states) మాత్రం వెనుక‌బ‌డ్డాయి. 2024లో అత్య‌ల్ప అక్ష‌రాస్య‌త రేటు క‌లిగిన రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (72.6 శాతం) మొద‌టి స్థానంలో ఉంది. తెలంగాణ (76.9శాతం)తో దిగువ నుంచి ఆరో ప్లేస్‌లో నిలిచింది. మొత్తంగా అత్య‌ల్ప అక్ష‌రాస్య‌త క‌లిగిన ఉన్న రాష్ట్రాల్లో ఏపీ త‌ర్వాత బీహార్ (74.3%), మధ్యప్రదేశ్ (75.2%), రాజస్థాన్ (75.8%), జార్ఖండ్ (76.7%) , తెలంగాణ (76.9%), ఉత్తర ప్రదేశ్ (78.2%) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Literacy Rate | చిన్న రాష్ట్రాలే ముందు..

అక్ష‌రాస్య‌త రేటులో చిన్న రాష్ట్రాలే (Small states) ముందుండ‌డం గ‌మ‌నార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం 91.33% అక్షరాస్యత రేటుతో భారతదేశంలో (india) మూడో స్థానంలో నిలిచిన మిజోరం.. తాజాగా లెక్క‌ల ప్ర‌కారం మిజోరం మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించింది. ఇందుకు విరుద్ధంగా PLFS 2023-24 MoSPI సర్వే ప్రకారం.. పట్టణ, గ్రామీణ జనాభా అత్య‌ధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, బీహార్ (Andhra Pradesh and Bihar) రుసగా 72.6%, 74.3% అక్షరాస్యత రేటును నమోదు చేశాయి. గ్రామీణ, పట్టణ జనాభాలో 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు (పురుషులు, మహిళలు) సహా భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 2023-24 కాలంలో 80.9%గా ఉంది.

Literacy Rate | అత్యధిక అక్షరాస్యత రేట్లు కలిగిన టాప్ 10 రాష్ట్రాలు

  1. మిజోరం 98.2%
  2. లక్షద్వీప్ 97.3%
  3. నాగాలాండ్ 95.7%
  4. కేరళ 95.3%
  5. మేఘాలయ 94.2%
  6. త్రిపుర 93.7%
  7. చండీగఢ్ 93.7%
  8. గోవా 93.6%
  9. పుదుచ్చేరి 92.7%
  10. మణిపూర్ 92%

Literacy Rate | అత్యల్ప అక్షరాస్యత కలిగిన 10 రాష్ట్రాలు

  1. ఆంధ్రప్రదేశ్ 72.6%
  2. బీహార్ 74.3%
  3. మధ్యప్రదేశ్ 75.2%
  4. రాజస్థాన్ 75.8%
  5. జార్ఖండ్ 76.7%
  6. తెలంగాణ 76.9%
  7. ఉత్తర ప్రదేశ్ 78.2%
  8. ఛత్తీస్‌గఢ్ 78.5%
  9. లడఖ్ 81%
  10. జమ్మూకశ్మీర్ 82%