అక్షరటుడే, వెబ్‌డెస్క్ :India Iphones | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్‌గా ఆయన భారత్ తో పాటు ఇతర దేశాల్లోలో ఫోన్ల తయారీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆపిల్ సీఈఓ(Apple CEO) టిమ్ కుక్ కు మరో హెచ్చరిక చేశారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు భారతదేశంలో లేదా మరే ఇతర దేశంలో కాకుండా అమెరికాలోనే తయారు కావాలని, లేకుంటే కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈయూ నుంచి అమెరికాకు జరిగే దిగుమతులపై 50 శాతం పన్నులు విధిస్తామని ఆయన ప్రకటించారు. జూన్ 1 నుంచే వాటిని అమల్లోకి తెస్తామన్నారు. చైనా, భారత్‌లలో ఐఫోన్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్న యాపిల్ కంపెనీకి కూడా ట్రంప్ షాకిచ్చారు.
India Iphones | ఇక్కడే చౌక..
అయితే భారత్ లో ఐఫోన్ అసెంబ్లింగ్(iPhone Assembling) ఖర్చు సుమారు 30 డాలర్స్ కాగా, అమెరికాలో 390 డాలర్లు. దేశంలో కార్మికుడికి నెల సంపాదన 230 డాలర్స్ అంటే 19 వేల రూపాయలు. అదే అమెరికాలో America కనీస వేతన చట్టాల కారణంగా సంపాదన 2900 డాలర్స్ అంటే 2.4 లక్షల రూపాయలు. అంటే రెండింటికి 13రెట్ల వ్యత్యాసం ఉంది. ఇక భారత్ ఇచ్చే పీఎల్ఐ పథకం(PLI Scheme) కూడా యాపిల్‌కి అదనపు లాభాలని అందిస్తుంది. అంటే భారత్‌లో తయారు చేసే ఐఫోన్స్‌పై 25 శాతం సుంకం విధించినా.. చౌకగా లభిస్తాయని నివేదిక చెబుతుంది.
భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కుక్ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే నిన్న టిమ్ కుక్(Tim Cook)తో నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని ట్రంప్ అన్నారు. “ఆపిల్ భారతదేశం అంతటా ఉత్పత్తి చేస్తున్నారు. మీరు భారతదేశంలో తయారు చేయకూడదని నేను కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఆపిల్ తన ఐఫోన్‌లలో ఎక్కువ భాగాన్ని చైనాలో తయారు చేస్తుంది. అలాగే USలో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి లేదు. మార్చి వరకు 12 నెలల్లో ఆపిల్ భారతదేశంలో $22 బిలియన్ల విలువైన ఐఫోన్‌లను Iphones అసెంబుల్ చేసింది. గత సంవత్సరం కంటే ఉత్పత్తిని దాదాపు 60% పెంచింది. కాగా, జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల కంపెనీ త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రకటించారు.