అక్షరటుడే, మెదక్ : Medak | హవేళి ఘనపూర్ (Haveli Ghanpur) మండలం బూర్గుపల్లి (Burugupalli) గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు సాగాయి. వేడుకల్లో భాగంగా శనివారం మత్తడి పోచమ్మ ఆలయం (Mathadi Pochamma Temple) చుట్టూ ఎడ్లబండ్లను తిప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షం పడటంతో ఆలయ పరిసరాలు బురదమయంగా మారాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
