ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vallabhaneni Vamshi | క‌స్ట‌డీలో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌..ఆందోళనలో భార్య, కుటుంబ సభ్యులు

    Vallabhaneni Vamshi | క‌స్ట‌డీలో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌..ఆందోళనలో భార్య, కుటుంబ సభ్యులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vallabhaneni Vamshi | గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు వల్లభనేని వంశీ మోహన్. ఆయ‌న ముందు టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యే(MLA)గా ఎన్నిక ఆ త‌ర్వాత వైసీపీ(YSRCP)లో చేరారు. అయితే, వంశీపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. ఈ కేసులో అతనిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. నూజివీడు కోర్టు ఆదేశాల మేరకు వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే క‌స్ట‌డీలో ఉన్న వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    Vallabhaneni Vamshi | తీవ్ర అస్వ‌స్థ‌త‌..

    ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడటంతో ఆయన్ని హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వంశీ హెల్త్ కండీషన్‌పై కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వల్లభనేని వంశీపై నమోదైన 8 కేసులకు సంబంధించి గత కొద్దిరోజులుగా పోలీసులు వైసీపీ నేతను విచారిస్తుండా, ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే వంశీ హెల్త్ కండీషన్(Vamshi health condition) సీరియస్‌గా ఉండటంతో ఆయన భార్య వంకజశ్రీ, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

    వంశీకి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఎయిమ్స్‌(AIIMS)కి తరలించాలని.. ఆరోగ్యం బాగోలేక ఇబ్బందిపడుతుంటే కేసుల పేరుతో వేధించడం ఏ మాత్రం స‌బ‌బు కాద‌ని పేర్ని నాని అన్నారు. వంశీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి(Kankipadu Government Hospital)లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. వైసీపీ నేతలు, వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే హెల్త్ కండీషన్‌పై ఆందోళన చెందుతున్నారు. మ‌రోవైపు వైసీపీ రెబ‌ల్ క్యాండెట్ కొడాలి నాని (Kodali Nani)కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రు చేసిన హంగామా మాముల‌గా లేదు. కాని ఇద్ద‌రు ఒకేసారి అనారోగ్యం బారిన ప‌డ‌డం అభిమానుల్లో టెన్షన్ పెంచుతుంది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...