ePaper
More
    HomeతెలంగాణHyderabad Metro | తగ్గిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమలులోకి..

    Hyderabad Metro | తగ్గిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమలులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad Metro | హైదరాబాద్​ మెట్రో(Hyderabad Metro)లో తగ్గిన ఛార్జీలు నేటి(శనివారం) నుంచి అమలులోకి వచ్చాయి.

    కాగా మెట్రోకు నష్టాలు వస్తున్నాయని ఇటీవల ఎల్​ అండ్​ టీ సంస్థ టికెట్​ రేట్ల(Ticket rates)ను పెంచిన విషయం తెలిసిందే. కనిష్ట టికెట్​ ధర రూ.10 నుంచి 12కు గరిష్ట టికెట్​ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచింది. పెంచిన రేట్లు మే 17 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే రేట్ల పెంపుపై ప్రయాణికుల(Passenger) నుంచి వ్యతిరేకత రావడంతో మెట్రో వెనక్కి తగ్గింది. పెంచిన రేట్లలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

    సవరించిన మెట్రో ఛార్జీల(Metro Charges) ప్రకారం కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69 ఉండనుంది. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 3 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17.. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.28.. 6 నుంచి 9 కి.మీ వరకు రూ.37కి రేటు తగ్గించారు.

    9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కు, 12 నుంచి 15 కి.మీ రూ.55 నుంచి రూ.51రేట్లను తగ్గించారు. 15నుంచి 18 కిలోమీటర్ల రూ.56, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61, 21 నుంచి 24 కి.మీ వరకు రూ.65, 24 కిలోమీటర్లపై ఉంటే రూ.69 మెట్రో ఛార్జి వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...