ePaper
More
    Homeబిజినెస్​Today gold price | కాస్త తగ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మ‌హిళ‌లు తొంద‌ర‌ప‌డండి మ‌రి..!

    Today gold price | కాస్త తగ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మ‌హిళ‌లు తొంద‌ర‌ప‌డండి మ‌రి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Today gold rate | కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు దోబూచులాడుతున్నాయి. ఒక‌సారి పెర‌గ‌డం, మ‌రోసారి త‌గ్గ‌డం వంటివి మ‌నం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ త‌ర్వాత‌ మళ్లీ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వరుసగా మూడోరోజు ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లో బలమైన ట్రెండ్‌ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.100 పెరిగి తులానికి రూ.98,750కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.100 పెరిగి తులానికి రూ.98,300కి పెరిగింది. కాగా.. ఈరోజు (gold rates today may 24th 2025) ఉదయం నాటికి వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.

    Today gold price | కాస్త త‌గ్గుద‌ల‌..

    24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గి రూ. 97,520కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 520 తగ్గి రూ. 89,390కి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో Delhi 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 97,670 స్థాయికి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,540కు చేరింది. దీంతో నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వెండి రేట్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,100 తగ్గిపోయి రూ.99,900కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడ, వరంగల్, తిరుపతిలో వెండి రేటు రూ.1200 తగ్గిపోయి రూ.1,10,900కి చేరింది.

    మరోవైపు కేరళ, చెన్నై ప్రాంతాల్లో కూడా వెండి Silver ధరలు రూ.110,900 స్థాయికి చేరుకున్నాయి. ముంబై, నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్ ప్రాంతాల్లో వెండి రేట్లు కిలోకు రూ. 99,900గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం, డాలర్ విలువలో మార్పులు, భారతదేశంలో బంగారం డిమాండ్‌లో సీజన్ మార్పులు ఈ ధరల తగ్గుదలకు కారణాలుగా చెబుతున్నారు. అంతేకాదు దేశీయ బంగారం ధరలు అంతర్జాతీయ ధరలతో పాటు దిగుమతి సుంకాలు, స్థానిక పన్నులు, బులియన్ అసోసియేషన్ నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...