అక్షరటుడే, గాంధారి: MLA Madan Mohan Rao | ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు శుక్రవారం గాంధారి (Gandhari) మండల కేంద్రంలో పర్యటించారు. ముందుగా దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల (Indiramm Illu) నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే నెహ్రూ చౌరస్తా నుంచి సుభాష్ బొమ్మ వరకు చేపట్టిన సీసీ రోడ్దును ప్రారంభించారు.
