అక్షరటుడే, వెబ్డెస్క్: Mlc kavitha | బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్(BRS) లేఖ రాసిన మాట వాస్తవమేనని ఎమ్మెల్సీ కవిత(Mlc kavitha) వెల్లడించారు. కేసీఆర్ దేవుడి లాంటి వ్యక్తి అని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం వెనుక కుట్ర దాగుందని చెప్పారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత.. శంషాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు లేఖ రాసిన అంశాన్ని అంగీకరించిన ఆమె.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల క్రితం కేసీఆర్ లేఖ రాశానని చెప్పారు. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు అనుకునేదే తాను లేఖలో పేర్కొన్నానని చెప్పారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉందన్నారు. లేఖ బహిర్గతం కావడం వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉందన్నారు. కేసీఆర్(KCR)కు ప్రతీసారి లేఖలు రాస్తానని, కానీ ఈసారి రాసిన లెటర్ ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని చెప్పారు. మా నాయకుడు కేసీఆర్.. అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందన్నారు. అయితే, దేవుడి లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Mlc kavitha | కుట్ర జరుగుతోంది..
పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని కవిత తెలిపారు. ఈ అంశంపై ఆమె విలేకరులు వేసిన ప్రశ్నలకు ఆమె బదులిస్తూ .. కుట్ర విషయం జరుగుతుందన్న విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ‘నేను వరంగల్ సభ(Warangal Sabha) తర్వాత రెండు వారాలం క్రితం నా త్రండి, పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. కేసీఆర్‌కు అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియడం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చేలోపు లేఖ బహిర్గతమైందని, దానిపై హంగామా నడుస్తున్నట్లు తెలిసింది. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని నేను మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడం పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో ఉన్న నాయకులు అనుకుంటున్న విషయాలనే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి లేఖలు రాశా. కేసీఆర్ దేవుడు.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుందని’ కవిత వ్యాఖ్యానించారు.