అక్షరటుడే, వెబ్డెస్క్ : ED raids | వేలాది కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) (Enforcement Directorate) శుక్రవారం పలుచోట్ల ఏకకాలంలో దాడులు చేసింది. రూ.12 వేల కోట్ల మోసానికి పాల్పడినట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్ (JP Infratech), జేపీ అసోసియేట్స్ (JP Associates), ఇతరులపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో (money laundering case investigation) సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై భాగంగా సోదాలు నిర్వహించింది. ఈ మేరకు అధికారిక వర్గాలు నిర్ధారించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద ఢిల్లీ-NCR, ముంబై సహా 23 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ED raids | ఇన్వెస్టర్లను ముంచిన జేపీ
గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను జేపీ అసోసియేట్స్ (JP Associates) నిండా ముంచింది. వారి నుంచి సుమారు ₹12,000 కోట్ల మేరకు సేకరించిన సంస్థ.. వాటిని ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్ (JP Infratech), జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (JP Associates Limited), ఇతరులపై ఈ సోదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. గౌర్సన్స్, గుల్షన్, మహాగున్, సురక్ష రియాలిటీ వంటి, జేపీ ఇన్ ఫ్రా అనుబంధ సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, దాడుల నేపథ్యంలో సంబంధిత కంపెనీలు ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.